అర్జున్ సురవరం ట్విట్టర్ రివ్యూ

అర్జున్ సురవరం ట్విట్టర్ రివ్యూ
x
హీరో నిఖిల్
Highlights

యువకథానాయకుడు నిఖిల్ నటించిన తాజా చిత్రం అర్జున్ సురవరం. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

యువకథానాయకుడు నిఖిల్ నటించిన తాజా చిత్రం అర్జున్ సురవరం. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నకిలీ సర్టిఫికేట్లను ముంద్రించే ముఠా గుట్టురట్టు చేయడమే కథాంశంగా, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. నిఖిల్ కు జంటగా లావణ్య త్రిపాఠి కథనాయికగా నటించారు. టీఎన్ సంతోష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 'ఠాగూర్' మ‌ధు నిర్మాణ స‌మ‌ర్పణ‌లో మూవీ డైన‌మిక్స్ ఏల్ఏల్సీ బ్యాన‌ర్‌పై రాజ్‌ కుమార్ ఆకెళ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో పోసాని కృష్ణముర‌ళి, సత్య, త‌రుణ్ అరోరా, విద్యుల్లేఖ రామన్, వెన్నెల కిషోర్, నాగినీడు, తారగణం ఇందులో నటించారు. ప్రముఖ సంగీత దర్శకుడు సి.ఎస్ సంగీతం సమకూర్చారు.

ఈ సినిమాలో నిఖిల్‌ జర్నలిస్టు‌గా కనిపించనున్నారు. లావణ్య త్రిపాఠి రిపోర్టర్‌గా కనిపించనుంది. తమిళంలో సూపర్‌ హిట్గా నిలిచిన కనితన్‌ను తెలుగులో 'అర్జున్ సురవరం'గా రీమేక్‌ చేశారు. విడుదలకు ముందే అనేక సార్లు డేట్ ప్రకటించి వెనక్కి తగ్గారు. అర్జున్ సురవరం చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి అండ దక్కడంతో ఒక్కసారి భారీ హైప్ వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. ప్రసంగం మధ్యలో పవన్ కళ్యాణ్‌ను ఇమిటేట్ చేశారు. ఈవెంట్ గ్రాండ్ సక్సెస్‌గా నిలిచింది.

ఇప్పటికే విడుదలైనా సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. నిఖిల్ ఈ సినిమాను చాలా సిరీయస్ గా తీసుకున్నారు. సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాకు మంచి హైప్ రావడంతో.. యుఎస్‌లో 150పైగా లొకేషన్లలో విడుదల చేశారు. మెగా అభిమానులు సైతం ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. ఇప్పటికే రిలీజ్ అయినా ఈ చిత్రానికి మంచి టాక్ వస్తుంది. నిఖిల్ నటన అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు. లావణ్య త్రిపాఠి నటన, గ్లామర్ ఈ సినిమాకు వర్కౌట్ అయిందంటున్నారు.

సినిమా ఆసాంతం ఎక్కడా థ్రిల్‌మిస్ కాకుండా చక్కటి స్క్రీన్ ప్లే దర్శకుడని నెటిజన్లు అంటున్నారు. ఇంటర్వేల్ ముందు వచ్చే ట్వీస్ట్ సినిమాకి హైలైట్ అని నెటిజన్లు అంటున్నారు. నిఖిల్ కష్టానికి మంచి ఫలితం వచ్చిందని అంటున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories