"కార్తికేయ 2" ఇంగ్లీష్ లో కూడా విడుదల కాబోతోందా?

Nikhil will release his film in English | Tollywood
x

"కార్తికేయ 2" ఇంగ్లీష్ లో కూడా విడుదల కాబోతోందా? 

Highlights

"కార్తికేయ 2" ఇంగ్లీష్ లో కూడా విడుదల కాబోతోందా?

Karthikeya 2: నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో నటించిన "కార్తికేయ" సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఆ సినిమాకి కు సీక్వెల్ గా "కార్తికేయ 2" ని తెరకెక్కించనున్నారు దర్శక నిర్మాతలు. ఈ వారం విడుదల కాబోతున్న ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలలో చిత్రబృందం బిజీగా ఉంది. తాజాగా సినిమా టీం ఇస్కాన్ టెంపుల్ ను సందర్శించి అక్కడ స్వామిజీలకు సినిమా ట్రైలర్ ను కూడా చూపించి కథను కూడా వినిపించారట. ఈ నేపథ్యంలో ఇస్కాన్ టెంపుల్ సహ అధ్యక్షుడు అయిన వ్రిందావన్ చిత్ర బృందానికి సర్ప్రైజ్ ఇచ్చారు.

"సినిమా లో సనాతన ధర్మం గురించి చాలా చక్కగా చెప్పారు. మన సనాతన ధర్మం గురించి ప్రపందానికి తెలియాలి. కాబట్టి ఈ సినిమా ను ఇంగ్లీష్ లో డబ్ చేసి విడుదల చేయండి" అని ఆయన అన్నారట. ఇలాంటి సినిమా హాలీవుడ్ లో విడుదల అయితే అక్కడి వారికి హిందూ సాంప్రదాయం మరియు సనాతన ధర్మం గురించి తెలుస్తుందని ఆయన పేర్కొన్నారట. అయితే విడుదల తర్వాత సినిమా టాక్ ను బట్టి ఇంగ్లీష్ లో విడుదల గురించి దర్శక నిర్మాతలు అలోచించనున్నారని సమాచారం. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories