అనుపమ పరమేశ్వరన్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన నిఖిల్

Nikhil Siddhartha Comments On  Anupama Parameswaran
x

అనుపమ పరమేశ్వరన్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన నిఖిల్ 

Highlights

*ప్రమోషన్స్ కి రాదు అంటూ అనుపమపై కామెంట్లు చేసిన నిఖిల్

Nikhil Siddhartha: ఎప్పుడో కరోనాకి ముందు "అర్జున్ సురవరం" సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ "కార్తికేయ' సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న "కార్తికేయ 2" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఆగస్ట్ 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు నిఖిల్. అనుపమ పరమేశ్వర సినిమా ప్రమోషన్లకు రాదు అంటూ చురకలు అంటించారు నిఖిల్.

"ఉదయం ఐదు గంటలకే షూటింగ్ అన్నా సరే టైంకి వచ్చేస్తుంది. చాలా ప్రొఫెషనల్ గా ఎంతో ఫ్రెండ్లీగా ఉంటుంది. కానీ సినిమా ప్రమోషన్స్ అంటేనే ఆమె నుంచి ఎలాంటి స్పందన ఉండదు" అంటూ కామెంట్లు చేశారు నిఖిల్. ఈ కామెంట్లు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి. నిజానికి హీరోయిన్ ఆయన కొత్తల్లో అనుపమ కూడా సినిమా ప్రమోషన్స్ లో బాగానే పాల్గొనేది. కానీ తరువాత బొత్తిగా ప్రమోషన్స్ పైన దృష్టి పెట్టడం మానేసింది. "అంటే సుందరానికి" సినిమాలో కూడా ముఖ్య పాత్రలో కనిపించిన అనుపమ చిత్ర ప్రమోషన్స్ లో ఎక్కడ కనిపించలేదు. ఇక తాను హీరోయిన్ గా నటించిన "కార్తికేయ 2" సినిమా ప్రమోషన్స్ లో కూడా ఈ భామ కనుమరుగైపోయింది. దీంతో ఇలా ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండటం కష్టమేనంటూ ఇండస్ట్రీ పెద్దలు విశ్లేషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories