కార్తికేయ 2 : కాన్సెప్ట్ వీడియోతోనే అంచనాలు పెంచిన నిఖిల్

కార్తికేయ 2 : కాన్సెప్ట్ వీడియోతోనే అంచనాలు పెంచిన నిఖిల్
x
కార్తీకేయ concept Video
Highlights

టాలీవుడ్ యువ కథానాయకుడు నిఖిల్ మరో సాహసం చేస్తున్నారు. ఎప్పుడూ వైవిద్యభరితమైన చిత్రాలతో నిఖిల్ ప్రేక్షకులను అల్లరిస్తుంటాడు.

టాలీవుడ్ యువ కథానాయకుడు నిఖిల్ మరో సాహసం చేస్తున్నారు. ఎప్పుడూ వైవిద్యభరితమైన చిత్రాలతో నిఖిల్ ప్రేక్షకులను అల్లరిస్తుంటాడు. స్వామిరారా, కార్తికేయ , సూర్య ఇలా విభిన్న కథలతో నిఖిల్ సినిమాలను చేస్తుంటాడు. తాజాగా మరో సాహసం చేయబోతున్నాడు. 7ఏళ్ల కింద వచ్చిన కార్తికేయ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ చేస్తున్నాడు. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కానుంది.

ఇక ఈ సినిమా స్వీక్వెల్ ప్రకటించినప్పుడే చిత్రయూనిట్ పళని కార్తికేయ స్వామి దర్శించుకొని వచ్చారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ కాన్సెప్ట్ వీడియో చిత్రయూనిట్ విడుదల చేసింది. మరికొన్ని రోజుల్లో ఈసినిమా సీక్వెల్ షూటింగ్ ప్రారంభం కానుంది. కార్తీకేయ సూపర్ హిట్ కావడంతో సిక్వేల్ పై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి. సవ్యసాచి చిత్రం నిరాశపరచడంతో చందూమొండేటికి కూడా కార్తికేయ సీక్వెల్ తో హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు.

మరోవైపు నిఖిల్ ఇటీవలే అర్జున్ సురవరం సినిమాతో వచ్చాడు. ఆ సినిమా బాక్సాఫీసు ముందు హిట్ గా నిలిచింది. దాంతో నిఖిల్ కార్తికేయ సీక్వెల్‌పై మంచి అంచనాలే ఉన్నాయి. దీనికి కాన్సెప్ట్ వీడియో ఆకట్టుకుంటుంది. మరోసారి కుమారస్వామి గుడి రహస్యాలను చూపించడానికి ఈ దర్శకుడు వచ్చేస్తున్నాడు. కార్తికేయ 2 విడుదల అయితే విజయం సాధిస్తుందని ధీమాతో చిత్రయూనిట్ ఉంది.

తెలుగు ఇండస్ట్రీలో సీక్వెల్స్ పెద్దగా ఫలితం ఇవ్వలేదు. బాహుబలి మాత్రమే పార్ట్ 2 బ్లాక్ బస్టర్ అందుకుంది. చాలా చిత్రాలు నిరాశపరిచాయి. బాహుబలి తర్వాత సీక్వెల్స్ రాలేదు. అయితే ఈ సారి నిఖిల్ కార్తీకేయ-2 విజయం సంచలనం సృష్టిస్తుందని నిఖిల్ నమ్ముతున్నారు. కథలో బలంలో స్వీక్వెల్స్ కూడా సక్సెస్ సాధిస్తాయని ప్రూవ్ చేయాలనే పట్టుదలతో హీరో నిఖిల్, దర్శకుడు చందు ఉన్నారు. తాజాగా విడుదల చేసిన కాన్సెప్ట్ వీడియో చూస్తే సినిమాపై అంచనాలు ఊపందుకోనున్నాయి. ఈ సినిమాకు కాళభైరవ సంగీతం అందిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories