Nikhil Siddhartha: నెక్స్ట్ సినిమాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటున్న నిఖిల్

Nikhil Siddhartha: బాలీవుడ్ ప్రేక్షకుల కోసం తన సినిమాలలో మార్పులు చేర్పులు చేస్తున్న నిఖిల్

Jyothi
Updated on: 23 Sept 2022 10:00 PM IST
Nikhil is Taking a Key Decision Regarding the Next Movie
X

Nikhil Siddhartha: నెక్స్ట్ సినిమాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటున్న నిఖిల్ 

Nikhil Siddhartha: యువ హీరో నిఖిల్ తాజాగా "కార్తికేయ 2" సినిమాతో మర్చిపోలేని బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. "కార్తికేయ" సినిమాకి సీక్వెల్ గా చందు మొండేటి డైరెక్షన్లో ప్రేక్షకులు ముందుకి వచ్చిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక హిందీలో కూడా భారీ విజయాన్ని సాధించింది. నిజానికి బాలీవుడ్ లో ఏమాత్రం ప్రమోషన్లు కూడా లేకుండా విడుదల చేసినప్పటికీ సినిమా నార్త్ మార్కెట్లో కూడా అద్భుతమైన కలెక్షన్లను నమోదు చేసుకుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో కూడా తన మార్కెట్ను మరింత పెంచుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు నిఖిల్. తాజాగా తన తదుపరి సినిమాల విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాడు ఈ యువ హీరో.

త్వరలోనే నిఖిల్ "18 పేజీస్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. "కార్తికేయ 2" సినిమాలో నిఖిల్ తో రొమాన్స్ చేసిన అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. మరోవైపు రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సుకుమార్ స్క్రిప్ట్ ను అందించారు. ఈ సినిమా కాకుండా నిఖిల్ ఒక స్పై థ్రిల్లర్ సినిమా కూడా చేయబోతున్నారు. ఈ రెండు సినిమాలకి బాలీవుడ్ లో కూడా మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే చిత్ర దర్శక నిర్మాతలకు తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాక హిందీ ప్రేక్షకులను కూడా మెప్పించే కొన్ని ఎలిమెంట్స్ ను సినిమాలో పెట్టమని నిఖిల్ చెబుతున్నారట. మరి నిఖిల్ చేసే మార్పులు బాలీవుడ్ లో తన మార్కెట్ కు ఎంతవరకు ఉపయోగపడతాయో వేచి చూడాలి.

Jyothi

Jyothi

Next Story