Niharika Marriage: రెండో పెళ్లికి రెడీ అవుతున్న నిహారిక.. వరుడు ఎవరంటే..?

Niharika Konidela Second Marriage Details
x

రెండో పెళ్లికి రెడీ అవుతున్న నిహారిక.. వరుడు ఎవరంటే..?

Highlights

నిహారిక రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఉగాది తర్వాత నిహారికకు పెళ్లి చేయాలనే ఆలోచనలో నాగబాబు ఉన్నట్టు తెలుస్తోంది.

Niharika Marriage: నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొణిదెల కుటుంబం నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన సినిమాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఒకరకంగా నిహారిక సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ప్రేక్షకులకు దగ్గరయ్యారని చెప్పొచ్చు. అయితే ఈ అమ్మడు త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నారు.

సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతాయే.. విడాకులు కూడా అంతే వేగంగా జరిపోతుంటాయి. ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమకు సంబంధించి అనేక జంటలు విడిపోవడం చూస్తేనే ఉన్నాం. ఇక్కడ పెళ్లిళ్లు అనేవి నీటి రాతలే అవుతున్నాయి.

ఇక నిహారిక గతంలో పోలీస్ అధికారి తనయుడు చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత విభేదాల కారణంగా విడాకులు ఇచ్చారు. అప్పట్లో ఈ విషయం టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది. నటిగా, నిర్మాతగా రాణిస్తున్నారు. చైతన్యతో విడాకులు తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసుకుంటూ వెళ్తున్నారు. తాజాగా కమిటీ కుర్రోళ్లు సినిమాతో నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్నారు నిహారిక.

తాజాగా నిహారిక రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఉగాది తర్వాత నిహారికకు పెళ్లి చేయాలనే ఆలోచనలో నాగబాబు ఉన్నట్టు తెలుస్తోంది. తనకు చిన్నప్పటి నుంచి స్నేహితుడిగా ఉన్న అతన్నే పెళ్లి చేసుకోబుతున్నట్టు టాక్ నడుస్తోంది. ఇక పెళ్లి వార్తలపై నిహారిక కానీ, మెగా ఫ్యామిలీ నుంచి కానీ క్లారిటీ రావాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories