మా ఇద్దరి మధ్య ఏం లేదు : నిధి అగర్వాల్

మా ఇద్దరి మధ్య ఏం లేదు : నిధి అగర్వాల్
x
Highlights

సినిమా వాళ్ళపై రూమర్స్ రావడం అనేది సహజమే.. ఇది కొత్తేమి కాదు కూడా... అందులో భాగంగానే క్రికెటర్ కేఎల్ రాహుల్ తో హీరోయిన్ నిధి అగర్వాల్ డేటింగ్ లో...

సినిమా వాళ్ళపై రూమర్స్ రావడం అనేది సహజమే.. ఇది కొత్తేమి కాదు కూడా... అందులో భాగంగానే క్రికెటర్ కేఎల్ రాహుల్ తో హీరోయిన్ నిధి అగర్వాల్ డేటింగ్ లో ఉందని గత కొద్ది రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. అయితే వాటిపైన క్లారిటీ ఇచ్చింది నిధి.. తాజాగా మంచు లక్ష్మి వాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'ఫీట్ అప్ విత్ ది స్టార్స్' అనే రియాలిటీ షోలో పాల్గొన్నా నిధి దీనిపైన స్పందించింది.

రాహుల్ నేను మంచి స్నేహితులం మాత్రమే.. నేను లండన్‌లో ఉన్నప్పుడు పాకిస్థాన్‌పై ఇండియా క్రికెట్‌ మ్యాచ్‌ గెలిచింది. ఆ సమయంలో నేను భారత క్రికెట్‌ టీంని కలిసి అభినందించాను. నేను అప్పుడు రాహుల్ ని కలిశాను. అప్పుడు నాకు రాహుల్ బాగా తెలుసు అని చెప్పుకొచ్చింది నిధి.. మా ఇద్దరి మధ్య వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన నిధి ... అఖిల్ మజ్ను సినిమాతో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా నిధికి మంచి బ్రేక్ ఇచ్చింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories