మంగ్లీ బర్త్‌డే పార్టీలో హంగామా: రిసార్ట్‌పై పోలీసుల దాడి, గంజాయి-విదేశీ మద్యం స్వాధీనం

మంగ్లీ బర్త్‌డే పార్టీలో హంగామా: రిసార్ట్‌పై పోలీసుల దాడి, గంజాయి-విదేశీ మద్యం స్వాధీనం
x

మంగ్లీ బర్త్‌డే పార్టీలో హంగామా: రిసార్ట్‌పై పోలీసుల దాడి, గంజాయి-విదేశీ మద్యం స్వాధీనం

Highlights

మంగ్లీ పుట్టినరోజు పార్టీలో చేవెళ్ల పోలీసులు దాడులు నిర్వహించి గంజాయి, విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలకు ఈ వార్త చదవండి.

ప్రముఖ గాయనితోపాటు మద్యం, మత్తు పదార్థాల కేసు మరోసారి వార్తల్లోకెక్కింది. టాలీవుడ్ ఫేమస్ ఫోక్ సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలు ఈసారి వివాదంగా మారాయి. చేవెళ్ల శివారులోని ఓ ప్రైవేట్ రిసార్టులో మంగ్లీ తన స్నేహితుల కోసం బర్త్‌డే పార్టీ నిర్వహించినట్లు సమాచారం.

ఈ సమాచారం ఆధారంగా చేవెళ్ల పోలీసులు సదరు రిసార్ట్‌పై రైడ్‌ నిర్వహించారు. తనిఖీల్లో గంజాయి మరియు విదేశీ మద్యం పట్టుబడినట్లు ప్రాథమిక సమాచారం. ఘటనాస్థలంలో మద్యం బాటిల్స్, మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పార్టీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కేసు నమోదు చేసిన అధికారులు, పార్టీకి హాజరైనవారి వివరాలను సేకరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories