
ప్రపంచమంతా కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టింది. తెలుగు సినీ ఇండస్ట్రీ కూడా కొత్త ఏడాదిని కొత్త పొస్టర్ల్స్‌తో పలకరించింది.
ప్రపంచమంతా కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టింది. తెలుగు సినీ ఇండస్ట్రీ కూడా కొత్త ఏడాదిని కొత్త పొస్టర్ల్స్‌తో పలకరించింది. సినీ ప్రేక్షకులకు న్యూఇయర్ విషెస్ తెలుపుతూ., ప్రతి పోస్టర్లను ఆయా సినిమా యూనిట్ 2020 కానుకగా విడుదల చేశాయి. ఈ పోస్టర్స్ లో సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించాయి.
బన్నీ హీరోగా 'అల..వైకుంఠపురములో..' చిత్రంలలో పూజా హేగ్దే కథానాయకగా నటిస్తోంది. ఈ సినిమాలో గ్లామరస్ నటీ టబు లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలకి ఎక్కడలేని క్రేజ్ వస్తోంది. ఇప్పటికే విడుదలైనా సాంగ్స్, టీజర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సామజవరగమన, రాములో రాములా సాంగ్స్ రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవలే విడుదలైన సామసవరగమన సాంగ్ ప్రొమో రీలీజ్ చేసిన 24 గంటల్లో 1.5 మిలియన్ వ్యూవ్స్ తో రికార్డు సృష్టించింది. ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తు్న్నారు.
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ,మహేష్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. విజయశాంతి, సంగీత, రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్ సినిమా పైన మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. తాజాగా సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసి, సినిమాకి మరింత హైప్ తీసుకువచ్చింది.
యంగ్ హీరో నాగశౌర్య. తాజాగా అయన 'అశ్వథ్థామ' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి ఆయనే కథ అందించి సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నారు. రమణ తేజ అనే కొత్త దర్శకుడు ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాని శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై నాగశౌర్య మదర్ ఉషా ముల్పూరి నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని జనవరి 31న విడుదల చేయనున్నారు.
కళ్యాణ్ రామ్ 'ఎంత మంచివాడవురా'తో ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్పటికే రీలీజ్ అయిన టీజర్, పోస్టర్స్ సినిమాపైన భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. దానికితోడు 'శతమానం భవతి' లాంటి జాతీయ అవార్డును సొంతం చేసుకున్న దర్శకుడితో సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.
మేహరీన్ కథానాయకగా నటిస్తుంది. సుహాసిని, శరత్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆదిత్య మ్యూజిక్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో వస్తున్న ఈ మూవీని ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.జనవరి 15 న సినిమాని విడుదల చేయనున్నారు.
దర్బార్ సినిమాతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు రజనీకాంత్.. ఈ సినిమాకి ఇండియన్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహించారు. నయనతార హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కి విశేషమైన స్పందన వస్తుంది. ఇందులో రజినీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా జనవరి 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




