Unni Mukundan: ఆసక్తికరంగా 'మార్కో' కొత్త పోస్టర్‌.. స్టైలిష్‌ లుక్‌లో ఉన్ని ముకుందన్‌

New poster released from marco movie on the occasion of unni mukundan birthday
x

Unni Mukundan: ఆసక్తికరంగా 'మార్కో' కొత్త పోస్టర్‌.. స్టైలిష్‌ లుక్‌లో ఉన్ని ముకుందన్‌

Highlights

‘జనతా గ్యారేజ్’, ‘భాగమతి’, ‘ఖిలాడీ’ ‘యశోద’, మాలికాపురం వంటి చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్

‘జనతా గ్యారేజ్’, ‘భాగమతి’, ‘ఖిలాడీ’ ‘యశోద’, మాలికాపురం వంటి చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్ ఇప్పుడు ఉన్ని ముకుందన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం మార్కో . మైఖేల్, ది గ్రేట్ ఫాదర్ సినిమాల ఫేమ్ హనీఫ్ అదేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

అదేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్ష‌న్ జాన‌ర్‌లో రానున్న ఈ మూవీ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇప్ప‌టికే మూవీ నుంచి వచ్చిన మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది, తాజాగా ఉన్ని ముకుందన్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి సరికొత్త లుక్ సోషల్ మీడియాలో విడుదల అయ్యింది. ఈ లుక్ చాలా డిఫరెంట్ గా స్టన్నింగ్ గా ఉందని కామెంట్స్ వస్తున్నాయి.

ఈ ఏడాదిలోనే మార్కో మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ హై బడ్జెట్ యాక్షన్ మూవీని క్యూబ్స్ ఎంటర్‌టైనర్ బ్యాన‌ర్‌పై షరీఫ్ మహ్మద్ అబ్దుల్ గదాఫ్ నిర్మిస్తుండ‌గా.. ప్రేమ‌మ్ సినిమా హీరో నివిన్ పాలీ ఈ మూవీలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి ఆదరణ లభించింది. రక్తపు మరకలతో సీరియస్ లుక్ లో కత్తిని పట్టుకొని ఉన్ని ముకుందన్ లుక్ టెర్రిఫిక్ గా ఉంది.

అలాగే లేటెస్ట్ గా విడుదలైన పోస్టర్ చూస్తుంటే ఒక సిగర్ కాలుస్తూ... రక్తపు చేతిలో మనిషి తల పట్టుకొని, చేతికి మంటలు కనిపిస్తున్నాయి.. పోస్టర్ విభిన్నంగా , స్టన్నింగ్ గా ఉంది, ఈ లుక్ చూస్తుంటే సినిమా ఎలా ఉండబోతోందో ఒక అంచనా కు వస్తున్నారు ప్రేక్షకులు. త్వరలో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు మేకర్స్.

Show Full Article
Print Article
Next Story
More Stories