హగ్గులను కంట్రోల్ చేస్తాడనుకుంటే.. కంటిన్యూ చేయండని చెప్తాడేంటి..నాగ్ పై నెటిజన్ల ట్రోల్

Netizens Trolls on Bigg Boss 5 Host Nagarjuna About Siri Shanmukh Hug Issue
x

హగ్గులను కంట్రోల్ చేస్తాడనుకుంటే.. కంటిన్యూ చేయండని చెప్తాడేంటి..నాగ్ పై నెటిజన్ల ట్రోల్

Highlights

Bigg Boss 5 Telugu : సిరి హనుమంత్ - శన్ముఖ్ జస్వంత్ విషయంలో నాగార్జునపై నెటిజన్ల ట్రోల్స్

Bigg Boss 5: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 శనివారం జరిగిన ఎపిసోడ్ లో కంప్లైంట్ బాక్స్ టాస్క్ లో భాగంగా సిరి హనుమంత్ ని ఎవరి మీద నీ కంప్లైంట్ అని హోస్ట్ నాగార్జున‌ అడిగిన వెంట‌నే శన్ముఖ్ జస్వంత్ పైనే కంప్లైంట్ అంటూ అతడి ఫొటో తీసి కంప్లైంట్ రాసింది. నాగార్జున ఆ కంప్లైంట్ ఏంటని అడిగితే "న‌న్ను బాగానే చూసుకుంటున్నాడు కాని తిడుతున్నాడు" అని చెప్పింది. అంతటితో నాగార్జున మాట్లాడుతూ "నువ్వు ఫ్రెండ్ అని చెప్ప‌డానికి శన్ముఖ్ జస్వంత్ సిగ్గుప‌డుతున్నాడని అయినా నువ్వు ఫ్రెండ్లీ హ‌గ్‌లు ఇస్తూనే ఉన్నావుగా" అని అన్నాడు. దాంతో సిరి హనుమంత్ న‌వ్వుతూ "మా అమ్మకి ఫ్రెండ్షిప్ హ‌గ్ అని చెబుతున్నాడని" అంటుంది.

ఇక నాగార్జున ఆ మాటకి "శన్ముఖ్..సిరిని జాగ్ర‌త్త‌గా చూసుకోరా?" అని చెప్పడంతో వీకెండ్ ఎపిసోడ్ లో వీరిద్దరి మధ్య ఓవర్ యాక్షన్ ని కంట్రోల్ చేయమని చెప్తాడనుకుంటే ఇలానే మీ హగ్గులను కంటిన్యూ చేయండిరా అన్నట్టుగానే నాగార్జున మాట్లాడటంతో నాగ్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గతంలో జరిగిన వీకెండ్ ఎపిసోడ్ లో కూడా నాగార్జున కొంతమంది ఇంటి సభ్యులకు వత్తాసు పలికిన సందర్భంలో కూడా నాగార్జునని నెటిజన్లు ట్రోల్ చేసిన సంగతి తెలిసింది. శన్ను, సిరిల హగ్గుల గోల తట్టుకోలేకపోతున్నామని ఇంకా ఎన్నిరోజులు వీరిద్దరి ఓవర్ యాక్షన్ భరించాలని బుల్లితెర ప్రేక్షకులు తలలు పట్టుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories