హిందూ దేవుళ్లను అవమానించారు.. విజయ్ సేతుపతి పై నెటిజన్ల ఫైర్

హిందూ దేవుళ్లను అవమానించారు.. విజయ్ సేతుపతి పై నెటిజన్ల ఫైర్
x
Actor vijay sethupathi(File photo)
Highlights

తమిళ నటుడు విజయ్ సేతుపతి పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ దేవుళ్లను కీచక వస్తున్నారు అంటూ మండిపడ్డారు.

తమిళ నటుడు విజయ్ సేతుపతి పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ దేవుళ్లను కించపరుస్తున్నారు అంటూ మండిపడ్డారు.టీవీ ఛానల్ కార్యక్రమంలో విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల ఆగ్రహానికి కారణం అయ్యాయి. హిందూ దేవుళ్లకు అభిషేకం, అలంకరణ, కైంకర్యాలను తప్పుబడుతూ విజయ్ సేతుపతి కొన్ని వ్యాఖ్యలు చేశారు. విజయ్‌ సేతుపతికి సంబంధించిన ట్రోలింగ్‌, మీమ్స్‌ కూడా సామాజిక మాధ్యమాల్లో జోరుగా హల్‌చల్‌ చేస్తున్నాయి.

అఖిల భారత హిందూ మహాసభ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో.. హిందూ ఆలయాల్లో ఆగమ నియమాలను అనుసరించి చేసే కైంకర్యాలను కించపరుస్తూ.. మాట్లాడటంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. ఆయన అలా మాట్లాడటానికి కారణమేంటని ప్రశ్నించింది. సొంత ప్రచారానికి హిందూ మతమే దొరికిందా?అని మండిపడింది. విజయ్‌ సేతుపతిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నగర పోలీసు కమిషనర్‌కు ఓ లేఖ కూడా పంపింది. ఇంకా దీనిపై విజయ్ సేతుపతి స్పందించలేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories