Love Story Movie: వివాదాల్లో ఇరుక్కున్న లవ్ స్టోరీ సినిమా

Netizens Commenting on the Love Story Movie that Hurt the Sentiments of Religions | Cinema News Today
x

లవ్ స్టోరీ సినిమా(ఫోటో-ది హన్స్ ఇండియా)

Highlights

Love Story Movie: మతాల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ లవ్ స్టొరీ పై కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు

Love Story Movie: ఈమధ్యనే ఫిదా సినిమా తో సూపర్ హిట్ అందుకున్న శేఖర్ కమ్ముల నాగచైతన్య హీరోగా "లవ్ స్టోరీ" అనే సినిమాతో ఈ మధ్యే ప్రేక్షకుల ముందుకి వచ్చారు. "ఫిదా" సినిమాలో హీరోయిన్ గా నటించిన సాయి పల్లవి ఈ సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది. ప్రేమమ్ సినిమాలో కీలక పాత్ర పోషించిన సాయిపల్లవి నాగచైతన్య సరసన హీరోయిన్గా నటించిన రెండవ సినిమా ఇది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అయితే తాజాగా ఈ సినిమా ఇప్పుడు వివాదాల్లో ఇరుక్కుంది.

ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో జీసస్ క్రైస్ట్ మరియు వినాయక స్వామి ఫోటోలు రెండు పక్కపక్కనే పెట్టి ఉంటాయి. అన్ని మతాలు ఒక్కటే అనే ఉద్దేశంతో దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సన్నివేశాన్ని అలా చిత్రీకరించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు అదే సన్నివేశం సినిమా వివాదాలలో ఇరుక్కునేలా చేసింది. ఈ సన్నివేశం కొన్ని వర్గాల ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందట. సమానత్వం లేని చూపించాలి అనుకున్నప్పుడు దర్శకుడు అల్లా మరియు జీసస్ ఫోటోలను ఎందుకు పెట్టలేదు అంటూ సినిమా పై మండి పడుతున్నారు కొన్ని వర్గాల ప్రేక్షకులు. అయితే చిత్ర బృందం ఇంకా ఈ వివాదాలకి జవాబు ఇవ్వాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories