అందుకే రాజమౌళిని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు?

Netizens are Targeting Rajamouli
x

అందుకే రాజమౌళిని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు?

Highlights

Rajamouli: రాజమౌళిని టార్గెట్ చేస్తున్న నెటిజన్లు

Rajamouli: బాలీవుడ్ లో రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "బ్రహ్మాస్త్ర". అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాను తెలుగులో ప్రముఖ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు రాజమౌళి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బ్రహ్మాస్త్ర మరియు అయాన్ ల పై ప్రశంసల వర్షం కురిపించారు రాజమౌళి. అయితే గత కొంత సోషల్ మీడియాలో బాయ్ కాట్ బాలీవుడ్ అంటూ తెగ ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు ప్రేక్షకులందరూ బాలీవుడ్ ను బాయ్ కాట్ చేయాలి అంటుంటే మరోవైపు రాజమౌళి బాలీవుడ్ సినిమాని నెత్తిన పెట్టుకోవడం ఏమిటి అంటూ నెటిజన్లు రాజమౌళి ని సైతం సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేస్తున్నారు.

నిజానికి రాజమౌళి చాలావరకు వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాని ప్రమోట్ చేస్తూ ఇప్పుడు రాజమౌళి కూడా ట్రోలింగ్ కి గురవుతున్నారు. ఏదేమైనా రాజమౌళి మీద ఇలాంటి ప్రెషర్ పడటం ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. బాలీవుడ్ ని ప్రేక్షకులను పెద్దగా ఎంకరేజ్ చేయడం లేదు. లాల్ సింగ్ చద్దా, లైగర్ వంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. మరి ఈ బ్రహ్మాస్త్ర అయిన బాలీవుడ్ కి ఒక మంచి పెద్ద హిట్ ఇచ్చి పూర్వ వైభవం తిసుకోస్తుందో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories