రానాను గెలికిన నెటిజన్.. అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చిన రానా

రానాను గెలికిన నెటిజన్.. అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చిన రానా
x
RANA FILE PHOTO
Highlights

ఓ నెటిజన్ మాత్రం రానాపై సెటైర్ వేశాడు. ఆ నెటిజన్ రానా ఇచ్చిన ఇంటర్వ్యూని పోస్ట్ చేస్తూ ట్విటర్‌లో కామెంట్ పెట్టాడు.

టాలీవుడ్ భళ్లాలదేవుడు రానా, దగ్గుబాటి కుటుంబ వారసుడిగా అరంగేట్రం చేసిన ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. లీడర్ సినిమాతో హీరోగా అడుగుపెట్టిన రానా.. కొన్ని సినిమాలు వరుస పరాజయాలు ముఠకట్టుకున్నాయి. ఆ తర్వాత సినిమాల ఎంపికలో జాగ్రత్తాలు పాటించాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో భళ్లాలదేవుడు రానా క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత నుంచి విభిన్న పాత్రలు ఎంచుకుంటున్నారు. ఇక రానా తాజాగా నటించిన బహు భాషా చిత్రం 'హాథీ మేరే సాథీ' ఫస్ట్ ‌లుక్‌ను విడుదల చేసింది. కాగా.. ఈ సినిమాకు సంబంధించి పోస్టర్‌ విడుదల చేశారు.

ఈ పోస్టర్ రిలీజ్ తర్వాత ఫ్యాన్స్ అంతా అభినందనలు చెప్తుంటే.. ఓ నెటిజన్ మాత్రం రానాపై సెటైర్ వేశాడు. ఆ నెటిజన్ రానా ఇచ్చిన ఇంటర్వ్యూని పోస్ట్ చేస్తూ ట్విటర్‌లో కామెంట్ పెట్టాడు. రానా ఆ ఇంటర్వ్యూలో 'నేను 10వ తరగతి ఫెయిల్ అయ్యాను. కానీ, ఆ రిజల్ట్స్ నా కలలు నెరవేర్చుకోకుండా ఆపలేకపోయాయి' అని ఆ ఇటర్వ్యూలో చెప్పారు. దీనిపై సదరు నెటిజన్ ట్విటర్ లో షర్ చేసి కౌంటర్ వేసాడు. 'నా ఎందుకంటే కుటుంబానికి పెద్ద ప్రొడక్షన్ కంపెనీ ఉంది' అని కామెంట్ పెట్టాడు. కానీ రానా మాత్రం ఆవేశానికిలోను కాకుండా ఆ నెటిజన్‌కు బుద్ధి చెప్పాడు. 'అందులో ఏమీ లేదు బ్రో. మనం నటన అనే ఆర్ట్‌ని నేర్చుకోకపోతే వెనక ఎంత పెద్ద నిర్మాణ సంస్థ ఉన్నా వేస్టే. అంటూ బదులు ఇచ్చాడు. రానా ఇచ్చిన కౌంటర్‌కు ఆ నెటిజన్ ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉన్నాడు. రానా ఇచ్చిన ఆన్సర్‌కు అభిమానులు రానాను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories