Singer Sunitha: లైవ్‌లో వాట్సాప్‌ నెంబర్‌ అడిగిన నెటిజన్‌

Netizen Asked Singer Sunitha Whatsapp no Instagram live
x

సింగర్ సునిత (ఫైల్ ఇమేజ్)

Highlights

Singer Sunitha: తెలుగు గాయ‌నీ సునీత మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు.

Singer Sunitha: తెలుగు గాయ‌నీ సునీత మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. సునీత సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే సంగ‌తి తెలిసిందే సునీత అప్ డేట్స్ కోసం నెటిజ‌న్లు ఎంతో ఆస‌క్తిగా ఎదురూచూస్తారు.. కరోనా టైంలో కూడా అభిమానుల కోసం ఓ ప్రొగ్రాం ప్లాన్ చేశారు. క‌రోనా నుంచి అందరికీ కొంచెం రిలీఫ్ కలిగించేందుకు తనవంతు సాయం చేస్తున్నారు. ఇన్‌స్టా లైవ్‌లో ప్రతిరోజూ ఓ అరగంట పాటు పాటలు పాడుతున్నారు.

సునీత‌ నెటిజన్లు కోరిన పాటలు పాడుతూ.. తన గానామృతంతో కాస్త ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆదివారం ఇన్‌స్టా లైవ్‌లోపాటలు పాడుతూ ఫ్యాన్స్‌ అడిగే ప్రశ్నలకు సైతం సమాధానం చెప్పారు. మదర్స్‌ డే సందర్భంగా ఓ పాట పాడమని నెటిజన్‌ అడగ్గా అమ్మ అనగానే కంట్లోంచి నీళ్లు వస్తాయని, ఈ లోకంలో స్వచ్ఛత అనే దానికి పర్యాయపదమే అమ్మ అని చెబుతూ సునీత ఎమోషనల్‌ అయ్యారు.

ప్రస్తుతం హాస్పిటల్స్‌లో ఎంతోమందిని వైద్య సిబ్బంది బిడ్డలా చూసుకుంటున్నార‌ని అన్నారు. ప్రస్తుతం పరిస్థితి చాలా దారుణంగా ఉందని, హాస్పిటల్స్‌లో బెడ్స్‌ దొరక్క ఎంతోమంది అవస్థలు పడుతున్నారని, కాబట్టి అందరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు.

సునీత కు లైవ్ లోనే ఓ నెటిజ‌న్ నుంచి ఊహించ‌ని ప్ర‌శ్న ఎదురైంది. సునీత ఎలా స్పందిస్తారో అని అంద‌రూ అనుకున్నారు. ఇంతకు నెటిజ‌న్ ఎం అడిగాడంటే.. సునీత పాటలు పాడుతుండగా వాట్సాప్‌ నెంబర్‌ చెప్పమని అడిగాడు. దీనికి సో సారీ అండీ అంటూ నవ్వుతూనే సున్నితంగా తిరస్కరించారు. ఆత‌ర్వాత త‌న కార్య‌క్ర‌మం ముగించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories