Pawan Kalyan: ఓజీ ఏ ఓటీటీలో వస్తుందో తెలుసా.? అప్పుడే ప్రకటించిన సంస్థ..!

Netflix Buys Pawan Kalyans OG Movie and Naga Chaitanyas Tandel
x

Pawan Kalyan: ఓజీ ఏ ఓటీటీలో వస్తుందో తెలుసా.? అప్పుడే ప్రకటించిన సంస్థ..!

Highlights

Pawan Kalyan: ఓటీటీ సంస్థల మధ్య పోటీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సంస్థలు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కొంగొత్త చిత్రాలను ప్రేక్షకుల కోసం తీసుకొస్తున్నాయి.

Pawan Kalyan: ఓటీటీ సంస్థల మధ్య పోటీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సంస్థలు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కొంగొత్త చిత్రాలను ప్రేక్షకుల కోసం తీసుకొస్తున్నాయి. ఇందులో ముందు వరుసలో నిలుస్తోంది ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ప్లిక్స్. ఒకప్పుడు ప్రాంతీయ భాషల చిత్రాలను పెద్దగా అందించని నెట్‌ఫ్లిక్స్‌ తాజాగా మాత్రం వరుస సినిమాలతో సందడి చేస్తోంది. 2024లో బ్లాక్‌ బ్లస్టర్‌ మూవీస్‌ను తీసుకొచ్చిన నెట్‌ఫ్లిక్స్‌ 2025లో కూడా బ్లాక్‌ బ్లస్టర్‌ సినిమాలను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

2025లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న కొన్ని ప్రాజెక్టలుకు సంబంధించి ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌ హక్కులను సాధించింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సంక్రాంతి సందర్భంగా ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది. థియేట్రికల్ రన్‌ తర్వాత నెట్‌ ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమాలు రానున్నాయని చెబుతోంది. దీంతో ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ గురించి యూజర్లను అలర్ట్‌ చేసిందన్నమాట. ఇంతకీ ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో రానున్న ఆ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పవన్ కళ్యాణ్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓజీ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా తేదీని చిత్ర యూనిట్ ఇంకా ప్రకటించలేదు. ఇక నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కుతోన్న తండేల్‌ మూవీ నెట్‌ ఫ్లిక్స్‌లో రానుంది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మాస్‌ మహరాజ రవితేజ హీరోగా నటిస్తోన్న మాస్‌ జాతర మూవీ సైతం నెట్‌ ఫ్‌లిక్స్‌లో రానుంది. ఈ చిత్రంలో రవితేజకు జోడిగా శ్రీలీల నటిస్తోంది.

నెట్‌ఫ్లిక్స్‌లో రానున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ హిట్‌3. నాని, శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కుతోన్న ఈ సినిమా మే1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విజయ్‌ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ఓటీటీ హక్కులను సైతం నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకున్నట్లు ప్రకటించింది. మ్యాడ్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న మ్యాడ్‌ స్క్వేర్‌ మూవీ సైతం నెట్‌ఫ్లిక్స్‌లో రానుంది. ఫిబ్రవరి 26న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కుతోన్న జాక్‌ మూవీ సైతం నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఇక నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న అనగనగా ఒక రాజు మూవీ ఓటీటీ హక్కులను సైతం నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకుంది. ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ ది గ్రేటెస్ట్‌ రైవలరీ డాక్యుమెంటరీ సిరీస్‌ డిజిటల్‌ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories