కొరటాల శివ పై తగ్గిన నెగిటివిటీ..! కారణం అదేనా..?

Negativity on Koratala Siva Decreased due to Money Gave to Distributors for Loss | Live News
x

కొరటాల శివ పై తగ్గిన నెగిటివిటీ..! కారణం అదేనా..?

Highlights

Koratala Shiva: అప్పటిదాకా కేవలం బ్లాక్ బస్టర్ సినిమాలను మాత్రమే అందించిన స్టార్ డైరెక్టర్ కొరటాల శివ...

Koratala Shiva: అప్పటిదాకా కేవలం బ్లాక్ బస్టర్ సినిమాలను మాత్రమే అందించిన స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఒక్కసారిగా ఆచార్య సినిమాతో మొట్టమొదటిసారిగా డిజాస్టర్ ను అందుకున్నారు. ఇక ఆ సినిమా విడుదలైన తర్వాత నుంచి కొరటాల శివ పై అభిమానుల్లో నెగిటివిటీ బాగా పెరిగిపోయింది. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత చిత్ర బృందం నుంచి ఒక్కరు కూడా సినిమా కలెక్షన్ల గురించి మాట్లాడలేదు.

మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన మొట్ట మొదటి సినిమాగా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ సినిమా డిజాస్టర్ అవడానికి గల కారణం కొరటాల శివ మాత్రమే అంటూ అభిమానులు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేశారు. కానీ ప్రస్తుతానికి కొరటాల శివ పై ట్రోలింగ్ తగ్గిందనే చెప్పొచ్చు. ఈ మధ్య ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు కలగడంతో చిరంజీవి తో పాటు కొరటాల కూడా ముందుకు వచ్చి డిస్ట్రిబ్యూటర్లకు కొంత పరిహారాన్ని చెల్లించి వారికి ఊరట కలిగించారు.

అప్పటి నుంచి మళ్లీ కొరటాల శివ పై నెగిటివిటీ కొంచెం తగ్గింది. అదే ఇప్పుడు కొరటాల శివ తదుపరి సినిమాకి కి ప్లస్ అయింది. కొరటాల శివ ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనిరుధ్ అందించిన సంగీతం కూడా బాగానే ఉంది. ఇక ఎన్టీఆర్ గురించి కొరటాల శివ కొన్ని పవర్ ఫుల్ డైలాగులు చెప్పటం అభిమానులు దృష్టిని బాగానే ఆకర్షించింది. ఏదేమైనా ఆచార్య సినిమా ఎఫెక్ట్ ఎన్టీఆర్ సినిమా పై ఉండదని అభిమానులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories