Top
logo

మళ్ళీ మళ్ళీ వినాలనిపించే నీలి నీలి ఆకాశం పాట సాహిత్యం!

మళ్ళీ మళ్ళీ వినాలనిపించే నీలి నీలి ఆకాశం పాట సాహిత్యం!
Highlights

ప్రియురాలిని వర్ణించాలంటే ప్రేమికుడికి చాలా కష్టం. అదే ప్రియురాలు నాకేమిస్తావు? అని ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వడమూ కష్టమే. అయితే, అలవోకగా ఓ కవిత చెప్పేసి అమ్మడిని ఐస్ చేసేయొచ్చు. ఇదొక ఐడియా.

ప్రియురాలిని వర్ణించాలంటే ప్రేమికుడికి చాలా కష్టం. అదే ప్రియురాలు నాకేమిస్తావు? అని ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వడమూ కష్టమే. అయితే, అలవోకగా ఓ కవిత చెప్పేసి అమ్మడిని ఐస్ చేసేయొచ్చు. ఇదొక ఐడియా. అదే చేశాడు ప్రదీప్. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనేది నేర్పిస్తానంటూ వెండితెరమీద సందడి చేయబోతున్న ప్రదీప్ తన వెండి తేరా ప్రియురాలితో తొలిపాట పడుతూ దాని వీడియో విడుదల చేశారు. ప్రేమికుల మధ్య ఉండే సున్నితమైన భావనల్ని.. ముఖ్యంగా ప్రియురాల్ని మురిపెంగా చూసుకునే ప్రియుడు పాడుకునే పాట అది. చంద్రబోస్ తన కలంతో ఆ పాటను నెలవంక అంత అందంగా తీర్చి దిద్దారు.

ప్రియుని భావుకతలోని కమ్మతనాన్ని తన కలంతో మరింత రుచిగా చేశారు చంద్రబోస్. నాకేమిస్తావు అన్న ప్రియురాలికి నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా.. కానీ, మబ్బులు నిన్ను కమ్మేస్తాయని మానేశాను అంటూ తనకు ఆమె మీద ఉన్న ఆరాధనను ప్రియుడు పలికాడు. ఇక వానవిల్లులో ఉందని రంగువు నీవు.. ఎంతో వెతికాను ఆశగా..ఏదీ నీ సాటి రాదుగా అంటూ ఆమెకు చెబుతూనే.. ఏమీ తేలేని అశక్తతను తాళితో జయించొచ్చు అనుకున్నాడేమో నా ప్రాణమంతా తాళిని చేసి నే కట్టేస్తా అంటూ చెప్పుకోచ్చడా ప్రియుడు.

చంద్రబోస్ సాహిత్యానికి అనూప్ రూబెన్స్ స్వరాలు అచ్చు ఆ ప్రేయసీ ప్రేమికులలా కలిసిపోయాయి. అందుకే పాట విడుదలైన వెంటనే కుర్రకారు కిర్రెక్కిపోతున్నారు. రికార్డు స్థాయిలో ఈ వీడియో పాటను చూసేస్తున్నారు. ప్రస్తుతం టాప్ ట్రేండింగ్ లో ఉన్న ఈ నీలి నీలి ఆకాశం పాత సాహిత్యం చదువుతూ యూట్యూబ్ లో ఈ పాత వీడియో చూడండి మంచి మజా వస్తుంది. సిద్ శ్రీరాం, సునీతా పాడిన ఈ పాత లహరి ఆడియోస్ ద్వారా విడుదలైంది.

నీలి నీలి ఆకాశం

ఇద్దాము అనుకున్నా

మబ్బులు నిన్ను కమ్మేస్తాయని

మానేస్తూ ఉన్నా

నెలవంకను ఇద్దామనుకున్నా

ఒహోహో నీ నవ్వుకు

సరిపోదంటున్నా

నువ్వే నడిచేటి తీరుకే

తారలు మొలిచాయి నేలకే

నువ్వే వదిలేటి శ్వాసకే

గాలులు బ్రతికాయి చూడవే

ఇంత గొప్ప అందగత్తెకి ఏమి ఇవ్వనే

నీలి నీలి ఆకాశం

ఇద్దాము అనుకున్నా

మబ్బులు నిన్ను కమ్మేస్తాయని

మానేస్తూ ఉన్నా

ఓహో వానవిల్లులో

ఉండని రంగు నువ్వులే

ఏ రంగు చీరను నీకు నేయాలే

నల్ల మబ్బులా మెరిసే కళ్ళు నీవిలే

ఆ కళ్ళకు కాటుకా ఎందుకేట్టాలే

చెక్కిలిపై చుక్కగా

దిష్టే పెడతారులే

నీకైతే తనువంతా

ఆ చుక్కను పెట్టలే

ఎదో ఇవ్వాలి కానుకా

ఎంతో వెతికాను ఆశగా

ఏది నీ సాటి రాదికా

అంటూ ఓడాను పూర్తిగా

కనుకే ప్రాణమంతా తాళి చేసి

నీకు కట్టనా

నీలి నీలి ఆకాశం

ఇద్దాము అనుకున్నా

నీ హృదయం ముందర

ఆకాశం చిన్నది అంటున్నా

ఓహో అమ్మ చూపులో

వొలికే జాలి నువ్వులే

ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వలే .

నన్ను వేలితో నడిపే ధైర్యమే నీదే

నీ పాపనై పసి పాపనై

ఏమి ఇవ్వలే

దయగలిగిన దేవుడే

మనలను కలిపాదులే

వరమోసిగే దేవుడికే

నేనేమి తిరిగివ్వాలె

ఎదో ఇవ్వాలి కానుక

ఎంతో వెతికాను ఆశగా

ఏది నీ సాటి రాదికా

అంటూ అలిసాను పూర్తిగా

కనుకే మళ్ళీ మళ్ళీ జన్మనేత్తి

నిన్ను చేరనా

నీలి నీలి ఆకాశం

ఇద్దాము అనుకున్నా

మబ్బులు నిన్ను కమ్మేస్తాయని

మానేస్తూ ఉన్నా

Web Titleneeli neeli akaasham song lyrics
Next Story


లైవ్ టీవి