NBK: బాలయ్య పుట్టినరోజు కానుక. థియేటర్స్ లో మళ్లీ గర్జిస్తున్న నరసింహనాయుడు..

NBK: బాలయ్య పుట్టినరోజు కానుక. థియేటర్స్ లో మళ్లీ గర్జిస్తున్న నరసింహనాయుడు..
x

NBK: బాలయ్య పుట్టినరోజు కానుక. థియేటర్స్ లో మళ్లీ గర్జిస్తున్న నరసింహనాయుడు

Highlights

జూన్ 10న బాలకృష్ణ పుట్టిన రోజు. అభిమాన హీరో పుట్టినరోజు అంటే ఫ్యాన్స్ కు అది ఒక పండగ దినం. ఈ సందర్భంగా పురస్కరించుకొని జూన్ 10న నరసింహ నాయుడు చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు.

Bala Krishna: టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ జోరుగా నడుస్తోంది. స్టార్ హీరోల చిత్రాలను 4K టెక్నాలజీతో రీరిలీజ్ చేస్తూ అభిమానులను అలరించడమే కాకుండా నిర్మాతలు సైతం లాభాలు దండుకుంటున్నారు. ఇప్పటికే సింహాద్రి, ఖుషి, జల్సా, పోకిరి, చెన్నకేశవరెడ్డి, ఆరెంజ్ చిత్రాలు రీరిలీజై అభిమానులకు కనువిందు చేశాయి. రీసెంట్ గా నటశేఖర్ కృష్ణ తొలి జయంతిని పురస్కరించుకొని ఆయన నటించిన సూపర్ హిట్ మూవీ మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక, ఈ రీరిలీజ్ ట్రెండ్ లో భాగంగా నటసింహం బాలకృష్ణ ఆల్ టైమ్ సూపర్ హిట్ మూవీ నరసింహనాయుడు చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు.

జూన్ 10న బాలకృష్ణ పుట్టిన రోజు. అభిమాన హీరో పుట్టినరోజు అంటే ఫ్యాన్స్ కు అది ఒక పండగ దినం. ఈ సందర్భంగా పురస్కరించుకొని జూన్ 10న నరసింహ నాయుడు చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. వెంకట రమణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం.వీ.మురళీ కృష్ణ నిర్మాతగా బి.గోపాల్ దర్శకత్వంలో 2001 జనవరి 11న సంక్రాంతి కానుకగా వచ్చిన నరసింహనాయుడు బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంది. అప్పట్లోనే ఈ సినిమా 30 కోట్ల రూపాయలను వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డుగా నిలిచింది. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా సిమ్రాన్, ప్రీతి జింగానియా హీరోయిన్స్ గా నటించారు. మణిశర్మ పాటలు ఈ సినిమా స్థాయిని పెంచాయి. ఇప్పటికీ ఈ సినిమా పాటలు ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి.

నరసింహనాయుడు మూవీ రీరిలీజ్ ద్వారా వచ్చే కలెక్షన్స్ ను నందమూరి అభిమానులు సామాజిక సేవా కార్యక్రమాలకు వెచ్చించనున్నారు. మరోవైపు తమ అభిమాన హీరో పుట్టినరోజు సందర్భంగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమాకి సంబంధించిన అప్ డేట్ వస్తుందని ఎదురు చూస్తున్నారు. NBK 108 సినిమాకు సంబంధించి టైటిల్, గ్లింప్స్ విడుదల చేస్తారని ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. అంతే కాదు NBK 109 ప్రకటన కూడా ఉంటుందని నెట్టింట వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories