బాలకృష్ణ సినిమాకి నో చెప్పిన నయనతార

Nayanthara Rejected Bala Krishna Film Offer
x

బాలకృష్ణ సినిమాకి నో చెప్పిన నయనతార

Highlights

*అందుకే బాలకృష్ణ సినిమా ఆఫర్ ని తిరస్కరించిన నయనతార

Tollywood: నిజానికి నందమూరి బాలకృష్ణ సరసన నటించేందుకు హీరోయిన్ల కొదవ బాగానే ఉన్నట్లు చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ సరసన మూడుసార్లు నటించిన హీరోయిన్ నయనతార. స్టార్ బ్యూటీ నయనతార నందమూరి బాలకృష్ణ తో సరసన సింహ, జై సింహ, మరియు శ్రీరామరాజ్యం సినిమాలలో నటించింది. అయితే మూడు సినిమాల్లో బాలకృష్ణతో రొమాన్స్ చేసిన నయన్ బాలయ్యతో మరొకసారి నటించే అవకాశాన్ని వదులుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నందమూరి బాలకృష్ణ తాజాగా ఎప్పుడు క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలుస్తుంది

ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఎప్పటినుంచో దర్శక నిర్మాతలు వెతుకుతున్నారు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సంప్రదించగా నయన్ ఏకంగా 8 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. అయితే అంత భారీ మొత్తాన్ని ఇవ్వలేక పోయినందువల్ల నయనతార ఈ సినిమాకి నో చెప్పారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మళ్లీ ఇప్పుడు బాలకృష్ణ సరసన హీరోయిన్ కోసం వెతికే పనిలో పడింది చిత్ర బృందం. నయనతార కూడా అంతే జోరుగా ముందుకు సాగుతోంది. త్వరలో నయనతార మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న "గాడ్ ఫాదర్" అనే సినిమాతో మళ్ళీ తెలుగు ప్రేక్షకులు ముందుకు రాబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories