Nayanthara: పవన్‌ సినిమా రిజక్ట్‌ చేసిన నయనతార.. ఏంటా సినిమా? కారణం ఏంటి?

Nayanthara Rejected a Pawan Kalyan Movie Know the Reason Here
x

Nayanthara: పవన్‌ సినిమా రిజక్ట్‌ చేసిన నయనతార.. ఏంటా సినిమా? కారణం ఏంటి?

Highlights

Nayanthara: పవన్ కళ్యాణ్‌ సరసన నటించే అవకాశం వస్తే హీరోయిన్లు ఎగిరి గంతేస్తారు.

Nayanthara: పవన్ కళ్యాణ్‌ సరసన నటించే అవకాశం వస్తే హీరోయిన్లు ఎగిరి గంతేస్తారు. పవర్‌ స్టార్‌ క్రేజ్‌ తమ కెరీర్‌కు ఎంతో ఉపయోగపడుతుందని విశ్వసించే వారు చాలా మంది ఉంటారు. అందుకే ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవడానికి ఇష్టపడరు. అయితే అందాల తార నయనతార మాత్రం పవన్‌తో నటించే అవకాశం వచ్చినా వదులుకుందనే విషయం మీకు తెలుసా.? ఇంతకీ ఏంటా సినిమా.? వదులుకోవడానికి అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నయనతారకు ఎలాంటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్లలో ఒకరిగా పేరు సంపాదించుకుందీ చిన్నది. కోలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా రాణిస్తూనే టాలీవుడ్‌కి అడుగుపెట్టి వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అందంతో పాటు అభినయం కలగలిపిన ఈ బ్యూటీ, అవకాశాలపై శ్రద్ధ వహిస్తూ పెద్దగా ఆలోచించకుండా చాలానే ప్రాజెక్ట్స్ చేసేసింది.

అయితే ఆమె కెరీర్‌లో ఓ ఇంట్రెస్టింగ్ విషయం. టాలీవుడ్‌లో చాలా మంది స్టార్ హీరోలతో నటించినా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ సినిమా అవకాశం వచ్చి కూడా నయన్ స్వయంగా రిజెక్ట్ చేసింది. పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా వచ్చిన ‘వకీల్ సాబ్’ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాకి ముందు, డైరెక్టర్ మొదట నాయిక పాత్రకు నయనతారను ఎంపిక చేశారు. కానీ స్క్రిప్ట్‌లో ఆ పాత్రకు చాలా తక్కువ ప్రాధాన్యం ఉండటంతో, ఆమె ఆ ప్రాజెక్ట్ నుంచి వెనక్కి తగ్గిందని ఇండస్ట్రీలో టాక్. వకీల్‌సాబ్‌ సినిమాలో పవన్‌కు భార్యగా శృతీహాసన్‌ నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో పాత్ర కీలకమే అయినా నిడివి తక్కువగా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories