"గాడ్ ఫాదర్" కోసం ఈమధ్య కాలంలో చేయని పనిని చేయబోతున్న నయనతార

Nayanthara is going to promote Chiranjeevis Godfather Movie
x

"గాడ్ ఫాదర్" కోసం ఈమధ్య కాలంలో చేయని పనిని చేయబోతున్న నయనతార 

Highlights

"గాడ్ ఫాదర్" కోసం ఈమధ్య కాలంలో చేయని పనిని చేయబోతున్న నయనతార

Nayanthara: ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో నయనతార కూడా ఒకరు. ప్రముఖ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న నయనతార మళ్ళీ సినిమాలతో బిజీ కాబోతున్నారు. ప్రస్తుతం నయనతార చేతిలో బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఇక తమిళ్లో మాత్రమే కాక తెలుగులో కూడా నయనతార మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న "గాడ్ ఫాదర్" సినిమాలో ముఖ్యపాత్రలో కనిపించబోతున్నారు.

మలయాళం లో సూపర్ హిట్ అయిన "లూసిఫర్" సినిమాకి తెలుగు రీమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమా కి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.అయితే ఇంతకుముందెన్నడు చేయని ఒక పని నయనతార ఈ సినిమా కోసం చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పని మరి ఏమిటో కాదు ప్రమోషన్స్ లో పాల్గొనడం. స్టార్ హీరోయిన్ గా మారిన నయనతార తన సినిమా కోసం ఎంత కమిట్మెంట్ ఇస్తుందో అంతే డెడికేషన్ తో పనిచేస్తుంది.

కానీ ప్రమోషన్ల కోసం మాత్రం నాయనతార అంతగా ఆసక్తి చూపించదు. కానీ "గాడ్ ఫాదర్" సినిమా కోసం మాత్రం ఆమె ప్రమోషన్స్ లో పాల్గొనడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లి తర్వాత తెలుగు ప్రేక్షకులతో మళ్లీ మాట్లాడే అవకాశం కలుగుతుండడంతో ఆ అవకాశాన్ని వదులుకోకుండా నయనతార సినిమాని ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories