కరణ్ జోహార్ పై మండిపడుతున్న నయనతార అభిమానులు

Nayanthara Fans Angry With Karan Johar for Throwing Shade at her on Koffee With Karan
x

కరణ్ జోహార్ పై మండిపడుతున్న నయనతార అభిమానులు

Highlights

కరణ్ జోహార్ పై మండిపడుతున్న నయనతార అభిమానులు

Nayanthara Fans: బాలీవుడ్ లో ప్రముఖ ఫిలిం మేకర్ గా మంచి పేరు తెచ్చుకున్న కరణ్ జోహార్ "కాఫీ విత్ కరణ్" అనే పేరుతో ఒక సెలబ్రిటీ టాక్ షోని కూడా హోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ షో కి సంబంధించిన ఏడవ సీజన్ రన్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్ లోని మూడవ ఎపిసోడ్ కు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ మరియు టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత గెస్ట్ లుగా విచ్చేశారు.

ఈ నేపథ్యంలో సమంతతో ఇద్దరు స్టార్లు ఎందుకు కలిసి సినిమా చేయలేరు అనే విషయమై మాట్లాడుతూ ఉండగా సమంత హీరోల విషయం తెలియదు కానీ హీరోయిన్లలో మాత్రం అలాంటిదేమీ లేదని తాను కూడా నయనతారతో కలిసి నటించినట్లు చెప్పుకొచ్చింది. "కాతువాకుల రెండు కాదల్" అనే తమిళ సినిమాలో ఈ ఇద్దరూ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత వారిద్దరూ హగ్ చేసుకుని ఏడ్చినట్లుగా చెప్పుకొచ్చింది సమంత.

ఆ వెంటనే కరణ్ జోహార్ "నాట్ ఇన్ మై లిస్ట్" అంటూ నయనతారను తీసిపాడేయడంతో నయన్ అభిమానులు కరణ్ పై మండిపడుతున్నారు. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు సైతం నయనతార డేట్ ల కోసం ఎదురు చూస్తారని ప్రస్తుతం ఇండస్ట్రీలో హైయెస్ట్ రమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో నయన్ కూడా ఒకరని, అలాంటిది ఆమె గురించి నాట్ ఇన్ మై లిస్ట్ అనడం ఏమాత్రం బాగోలేదని నెటిజన్లు కరణ్ పై విరుచుకుపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories