Nayanthara: ప్రియుడితో కలిసి ఫ్లైటెక్కిన నయనతార.. దాని కోసమేనా

‍Nayantara and Vignesh Shivan
x

నయన్ - విఘ్నేష్ శివన్

Highlights

Nayanthara: సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ నయనతార, విఘ్నేష్ శివన్ వీళ్లిద్దరు గత కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్నా సంగతి తెలిసిందే.

Nayanthara: సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ నయనతార, విఘ్నేష్ శివన్ వీళ్లిద్దరు గత కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్నా సంగతి తెలిసిందే. అయితే వీరు ఎక్కడికి వెళ్లినా.. కెమెరా కళ్లన్ని వాళ్లపైనే ఉంటాయి. ఎయిర్ పోర్ట్‌లో వీరు మరోసారి జంటగా కనిపించి అభిమానులను కనువిందు చేసారు. ఈ నెల 14న కేరళలో విషు పండగ సందర్భంగా.. నయన్ శివన్ ఓ ప్రైవేటు విమానంలో కోచికి బయలుదేరి వెళ్లారు. ఈ నేపథ్యంలో వీరి పెళ్లి వార్తల గురించి ప్రచారం జరుగుతుంది.

వీరిద్ద‌రు క‌లిసి ఫొటోల‌ను విఘ్నేష్ త‌రచుగా సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకునేవాడు. న‌య‌న్, విఘ్నేష్ పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు చాలా సార్లు పుకార్లు వినిపించాయి. జీవితంలో సాధించాల్సింది ఉన్నాయని నేర‌వేర్చుకున్న త‌రువాతనే పెళ్లి చేసుకుంటామ‌ని విఘ్నేష్ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్లడించాడు. అయితే ఈ నెల 14న తమ పెళ్లి డేట్‌ను ప్రకటిస్తారని చెన్నై ఫిల్మ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. రిసెప్షన్ మాత్రం చెన్నైలో గ్రాండ్‌గా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ వేడుకకు తెలుగు సినీ ఇండస్ట్రీలో పలువురు నటీనటులుకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది.

విఘ్నేష్ తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. న‌య‌న్ చేతికి రింగు ఉంది. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ అయిపోయింద‌ని ప‌లువురు భావిస్తున్నారు. ఆ ఫొటోను చూసిన ప‌లువురు నెటిజ‌న్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇ విఘ్నేష్ శివ‌న్ తెర‌కెక్కించిన నానుమ్ రౌడీదాన్ చిత్రంలో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించింది. ఈ మూవీ షూటింగ్ స‌మ‌యంలో వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ మొద‌లైంది.


Show Full Article
Print Article
Next Story
More Stories