విక్కీ కౌశల్ కత్రినాకైఫ్ ల అడుగుజాడల్లో నడుస్తున్న నయనతార మరియు విఘ్నేష్ శివన్

Nayantara And Vignesh Sivan Wedding
x

విక్కీ కౌశల్ కత్రినాకైఫ్ ల అడుగుజాడల్లో నడుస్తున్న నయనతార మరియు విఘ్నేష్ శివన్

Highlights

Nayanatara Wedding: పెళ్లికి గెస్ట్ ల కోసం కోడ్ ని ఏర్పాటు చేసిన కోలీవుడ్ కపుల్

Nayanatara Wedding: గత కొంత కాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార మరియు విఘ్నేష్ శివన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. స్టార్ హీరోయిన్ నయనతార, ప్రముఖ డైరెక్టర్ విగ్నేష్ ను ప్రేమిస్తుందని వారిద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారని ఇప్పటికే చాలా పుకార్లు బయటకు వచ్చాయి. తాజాగా ఈ జంట జూన్ 9వ తేదీన కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకొని ఒకటి కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే విఘ్నేష్ శివన్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేసి తమ పెళ్ళికి సంబంధించిన డీటెయిల్స్ ను తెలియజేశారు.

పెళ్లి తర్వాత పెళ్లి ఫోటోలను తామే ప్రెస్ కి రిలీజ్ చేస్తామని చెప్పిన విగ్నేష్ జూన్ 11న మీడియా తో కలిసి లంచ్ చేస్తామని చెప్పారు. ఇక వీరిద్దరి పెళ్లి షెరటన్ గ్రాండ్ హోటల్ లో జరగబోతోంది అయితే పెళ్లి సమయంలో గెస్ట్ ల కోసం ఒక స్పెషల్ కోడ్ ఉంటుందని వారినే లోపలికి పంపిస్తారని తెలుస్తోంది. గతంలో కత్రినా కైఫ్ మరియు విక్కీ కౌశల్ కూడా తమ పెళ్లి ఈ సమయంలో కస్టమైజ్డ్ కోడ్ ఎంట్రీ ను వాడారు. ఇక ఇప్పటికే షెరటన్ గ్రాండ్ హోటల్ లో పెళ్లి హడావిడి మొదలైంది. మెహందీ ఫంక్షన్ కి 100 కి పైగా గెస్ట్ లు రాబోతున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories