Naveen Chandra: బాల‌య్య‌కు ముద్దు పెట్టాల‌నుకొన్నా!

Naveen Chandra Praises Balakrishna | Tollywood News
x

సెట్లో బాలకృష్ణ ముద్దొచేశారు అని చెప్పిన నవీన్ చంద్ర

Highlights

*సెట్లో బాలకృష్ణ ముద్దొచేశారు అని చెప్పిన నవీన్ చంద్ర

Naveen Chandra: నంద‌మూరి బాల‌కృష్ణ ది చిన్న పిల్లాడి మ‌న‌స్త‌త్వం అని ఇప్పటికే చాలా మంది చెప్పారు. ఎప్పుడు ఎలా ఉంటారో ఆయనకే తెలీదు అని అభిమానులు అంటారు. కొన్నిసార్లు సడెన్ గా ఫైర్ అవుతారు, మరికొన్ని సార్లు చెంప ఛెళ్లు మ‌నిపిస్తారు. కానీ ఆయ‌న‌తో ప‌నిచేసిన‌వాళ్ళు మాత్రం "బాల‌య్య దేవుడు" అనే అంటారు. తాజాగా ఇప్పుడు అలానే అనేవారి జాబితాలో న‌వీన్ చంద్ర కూడా చేరిపోయారు. బాల‌య్య లాంటి హీరోని నేనెప్పుడూ చూడలేదు.

ఆయ‌న‌తో ప‌నిచేసిన రోజులు చాలా అద్భుతంగా గ‌డిచాయి. ఆయ‌న నాకు తెగ ముద్దొచ్చేశారు. ఒక ముద్దు కూడా పెట్టాల‌నిపించేంత ప్రేమ వ‌చ్చింది అని చెప్పుకొచ్చాడు న‌వీన్ చంద్ర‌. బాల‌కృష్ణ – గోపీచంద్ మ‌లినేని కాంబో లో వస్తున్న సినిమా లో కీల‌కమైన పాత్ర పోషించాడు న‌వీన్ చంద్ర‌. "సెట్లో బాల‌య్య ఎన‌ర్జీ గురించి మాటల్లో చెప్పలేము. బ‌య‌ట ఆయ‌న గురించి చాలార‌కాలుగా మాట్లాడ‌తారు కానీ అవేం నిజం కాదు.

నేను చూసిన బాల‌య్య వేరు. ఈ సినిమాలో ఆయ‌న గెట‌ప్‌, స్టైల్‌, డైలాగులు నాకు తెగ న‌చ్చేశాయి" అని చెప్పుకొచ్చాడు న‌వీన్ చంద్ర‌. త‌న పాత్ర గురించి మాట్లాడుతూ "ఈ క‌థ‌లో నాలుగైదు పాత్ర‌లలో నా పాత్ర కూడా ఒక‌టి. నాది నెగిటీవ్ రోలా పాజిటీవ్ పాత్రా అని అపుడే చెప్ప‌ను కాన క‌చ్చితంగా నా కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్ర" అని అన్నారు న‌వీన్ చంద్ర‌.

Show Full Article
Print Article
Next Story
More Stories