వివి వినాయక్ 'సీనయ్య'లో విలన్ ఎవరంటే ?

seenayya vv vinayak
x
seenayya vv vinayak
Highlights

మాస్ దర్శకుడు వివి వినాయక్ హీరోగా అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఆయన హీరోగా సీనయ్య అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని దిల్ రాజ్...

మాస్ దర్శకుడు వివి వినాయక్ హీరోగా అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఆయన హీరోగా సీనయ్య అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని దిల్ రాజ్ నిర్మిస్తుండగా, నరసింహారావు దర్శకత్వం వహిస్తున్నారు... ఈ మధ్యే సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ఇందులో ఓ సాధారణమైన మెకానిక్ గా కనిపించనున్నాడు వినాయక్.. ఇప్పటికే దీనికి సంబంధించిన పోస్టర్ ని కూడా విడుదల చేసారు.

అయితే ఇందులో వినాయక్ కి విలన్ గా ఎవరు నటిస్తున్నారు అన్నదానిపై ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్ గా హీరో నవీన్ చంద్ర నటిస్తున్నట్టు సమాచారం.. ఈ మధ్య నవీన్ చంద్ర పోషించిన పాత్రలు అన్ని నెగిటివ్ రోల్స్ కావడం, అందులో నవీన్ చంద్ర అంచనాలకి మించి రాణించడంతో దర్శక నిర్మాతలు నవీన్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories