logo
సినిమా

జోరందుకున్న నాని సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్

జోరందుకున్న నాని సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్
X
Highlights

వరుసగా 'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాసు' వంటి రెండు డిజాస్టర్ ను అందుకున్న నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన...

వరుసగా 'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాసు' వంటి రెండు డిజాస్టర్ ను అందుకున్న నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన ఆశలన్నీ తన తదుపరి సినిమా అయిన 'జెర్సీ' పైనే పెట్టుకున్నాడు. స్పోర్ట్స్ డ్రామా గా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో శ్రద్ధ శ్రీనాధ్ హీరోయిన్ గా నటించింది. ముందు రెండు చిత్రాలు సరిగ్గా ఆడనప్పటికీ, 'జెర్సీ' ప్రీ రిలీజ్ బిజినెస్ జోరుగా సాగుతోంది. ప్రొడ్యూసర్ నాగ వంశీ 'జెర్సీ' చిత్రాన్ని 22 కోట్ల బడ్జెట్ తో నిర్మించారట. ఇప్పుడు కేవలం థియేట్రికల్ రైట్స్ తోనే 'జెర్సీ' 30 కోట్లకు పైగా మూటగట్టుకుంది అని ట్రేడ్ వర్గాల సమాచారం.

ఇవి కాక, శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్, హిందీ డబ్బింగ్ హక్కుల ద్వారా మరో రూ.12 కోట్ల రూపాయలను వెనకేసుకున్నారు నిర్మాతలు. మొత్తంగా 42 కోట్ల కు పైగా బిజినెస్ నమోదు చేసుకుంది 'జెర్సీ'. దీంతో ఈ సినిమా రిలీజ్ కు ముందే నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్స్ తీసుకొచ్చింది. నాని కెరీర్ లో రికార్డ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం ఏప్రిల్ 19 న విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రొఫెషనల్ క్రికెటర్ గా తన సత్తా చాటే మధ్యవయస్కుడిగా నాని కనిపించనున్నాడు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకీ సంగీత అందించారు. ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలే ఉన్నాయి.

Next Story