Tuck Jagadish: టక్ జగదీష్ లో నాని పాత్ర ఇదేనా?

Natural Star Nani Role in Tuck Jagadish Movie | Tuck Jagadish Release Date
x

Tuck Jagadish: టక్ జగదీష్ లో నాని పాత్ర ఇదేనా?

Highlights

Tuck Jagadish: తాజాగా ఈ సినిమాలో నాని పాత్ర గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

Tuck Jagadish: ఈ మధ్యనే 'వి' సినిమాతో డిజాస్టర్ అందుకున్న నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం "టక్ జగదీష్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమా లో రీతు వర్మ మరియు ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. "నిన్ను కోరి", "మజిలీ" సినిమాలకి దర్శకత్వం వహించిన శివ నిర్వాణ ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. "నిన్ను కోరి" తర్వాత శివ నిర్వాణ నాని కాంబినేషన్ లో రాబోతున్న రెండవ సినిమా ఇది. తాజాగా ఈ సినిమాలో నాని పాత్ర గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ఈ సినిమాలో నాని ఎమ్ ఆర్ ఓ పాత్రలో కనిపించబోతున్నారట. ఇప్పటిదాకా నాని రాజకీయ పాత్రలు పోషించలేదు. కాబట్టి ఈ సినిమాపై అభిమానులకు మరింత ఆసక్తి కలిగింది. జగపతిబాబు, డానియల్ బాలాజీ, నాసర్, రోహిణి, రావు రమేష్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హరీష్ పెద్ది మరియు సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 20 న డైరెక్టుగా అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదలకు సిద్ధమవుతోంది అని సమాచారం. మొదట ఈ సినిమాని థియేటర్లలోనే విడుదల చేయాలని అనుకున్నప్పటికీ పరిస్థితుల ప్రభావం వల్ల సినిమాని డైరెక్టుగా డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories