Nani: నేచురల్ స్టార్ నాని అసలు పేరు ఏంటో తెలుసా..?

Natural Star Nani Real Name Is Naveen Babu
x

నేచురల్ స్టార్ నాని అసలు పేరు ఏంటో తెలుసా..? 

Highlights

నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోలోగా ఎంట్రీ ఇచ్చి స్టార్‌‌ హీరోగా పేరు తెచ్చుకున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాని.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు.

Nani: నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోలోగా ఎంట్రీ ఇచ్చి స్టార్‌‌ హీరోగా పేరు తెచ్చుకున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాని.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు. అయితే నాని అసలు పేరు అది కాదంటూ ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకీ నాని అసలు పేరు ఏంటో చూద్దాం.

తన సహజమైన నటన, స్మైల్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు నాని. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు నానికి ఫ్యాన్స్ ఉన్నారు. మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన నాని.. అదృష్టం కలిసి రావడంతో హీరోగా మారిపోయారు. అలా బ్లాక్ బస్టర్ హిట్స్‌తో స్టార్‌ హీరో అయిపోయారు. అయితే నాని అసలు పేరు నవీన్ బాబు అంట. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తర్వాత తన పేరు నానిగా మార్చుకున్నట్టు సమాచారం.

నాని శ్రీను వైట్ల, బాపు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. హైదరాబాద్‌లో కొన్ని రోజులు రేడియో జాకీగా కూడా పనిచేశారు. ఆ తర్వాత అష్టా చమ్మా సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన నాని మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ఈగ మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత వరుస అవకాశాలు రావడంతో స్టార్ హీరోగా ఎదిగారు. అంతేకాదు నాచురల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. దసరా మూవీతో మాస్ హీరోగా మారారు. తన నటతో మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. అప్పటి వరకు లవర్ బాయ్‌గా కనిపించిన నాని.. దసరా సినిమాతో మాస్ లుక్‌తో అందర్నీ ఆకట్టుకున్నారు.

ప్రస్తుతం ఇటు హీరోగా నటిస్తూనే.. మరోవైపు నిర్మాతగా వ్యవహరిస్తూ వరుస సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు నాని. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కష్టపడి మంచి పొజిషన్‌లోకి వచ్చారు నాని.

Show Full Article
Print Article
Next Story
More Stories