logo
సినిమా

Nani: అది తన ఆఖరి పాట అని సిరివెన్నెల ముందే చెప్పారట

Natural Star Nani Emotional Comments on Sirivennela Sitaramasastri
X

"అలాంటి వాళ్ళు ప్రపంచంలోనే ఉండరు" అంటున్న నాని 

Highlights

"అలాంటి వాళ్ళు ప్రపంచంలోనే ఉండరు" అంటున్న నాని

Nani: టాలీవుడ్ ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఈ మధ్యనే నవంబర్ 30 న లంగ్ క్యాన్సర్ వల్ల మరణించిన సంగతి తెలిసిందే. సిరివెన్నెల ఇకలేరు అనే చేదు నిజాన్ని ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే కాక అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. సిరివెన్నెల లిరిక్స్ అందించిన ఆఖరి సినిమా నాని హీరోగా నటిస్తున్న "శ్యామ్ సింగరాయి". సిరివెన్నెల అందించిన పాట ఆయన పేరుతోనే రూపొందటం విశేషం. తాజాగా ఆ పాట గురించి మాట్లాడుతూ నాని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

"సిరివెన్నెల గారు మా సినిమా కి పాట రాయడం, అది ఆయన చివరి పాట రావడం మాకు చాలా ఎమోషనల్ విషయం. నిజానికి ఇది నా చివరి పాట అవుతుందేమో అని సిరివెన్నెల రాహుల్ తో ముందే అన్నారట. తర్వాత ఒక రోజు రాహుల్ నాతో ఈ విషయాన్ని చెప్పారు. కానీ నిజంగానే అలా అవుతుందని మేము ఎప్పుడూ అనుకోలేదు. ఆ ఒక్క పాటతో సినిమా కథ మొత్తం చాలా అద్భుతంగా చెప్పారు సిరివెన్నెల గారు. ఆ పాటని అబ్సర్వ్ చేసి తర్వాత సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. ఆయనలా రచించే వారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు" అని ఎమోషనల్ అయ్యారు నాని.

Web TitleNatural Star Nani Emotional Comments on Sirivennela Sitaramasastri
Next Story