National Film Awards 2025: బెస్ట్ యాక్టర్లుగా షారుక్ ఖాన్, విక్రాంత్ మస్సే

x

Highlights

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌కు మరో ఘనత దక్కింది. 2023 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఆయనకు ఉత్తమ నటుడిగా ఎంపికైంది. ‘జవాన్’ చిత్రంలో ఆయన చేసిన పాత్రకు ఈ గుర్తింపు లభించింది.

ఇక ఆయనతో పాటు విక్రాంత్ మస్సే కూడా ‘12th ఫెయిల్‌’ సినిమాతో ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. ఈ ఇద్దరూ సంయుక్తంగా ఈ అవార్డును పొందారు.

మరోవైపు, ఉత్తమ హిందీ చిత్రంగా ‘కథల్‌’ చిత్రం ఎంపిక కాగా, ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ సినిమాలో గాఢమైన భావోద్వేగంతో ఆకట్టుకున్న రాణీ ముఖర్జీకి ఉత్తమ నటి అవార్డు దక్కింది.

ఈ ఏడాది మొత్తం 15 విభాగాల్లో ఉత్తమ చిత్రాలు, నటీనటులను ఎంపిక చేసినట్లు జ్యూరీ ప్రకటించింది. అన్ని భాషల్లోని చిత్రాలను సమీక్షించి ఈ అవార్డులను కేటాయించినట్లు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories