ప్రెస్ మీట్ నుంచి వాక్ అవుట్ చేసిన నరేష్

Naresh Walks Out of the Press Meet
x

ప్రెస్ మీట్ నుంచి వాక్ అవుట్ చేసిన నరేష్

Highlights

Naresh: ఆ ఛానల్ వారు ఉంటే మాట్లాడను అంటున్న నరేష్

Naresh: సీనియర్ నటుడు నరేష్ వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. నరేష్ గత కొంతకాలంగా తన మూడో భార్య రమ్య రఘుపతి కి దూరంగా ఉంటున్న సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ తో నరేష్ సహజీవనం చేస్తున్నారని వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నరేష్ మూడో భార్య రమ్య తాను ఇంకా విడాకులు పేపర్లపై సంతకం చేయలేదని ఇప్పటికీ తను నరేష్ భార్య నేనని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు.

ఈ మధ్యనే నరేష్ విడాకుల నోటీసు పంపించారని కానీ చట్ట ప్రకారం ఆమె ఇంకా సమాధానం ఇవ్వాల్సి ఉందని, దానికి కారణం ఆమె మెయింటెనెన్స్ విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ ఉందని చెప్పుకొచ్చారు. తాజాగా రమ్య ఆరోపణలకు స్పందించిన నరేష్ బెంగళూరు ప్రెస్ మీట్ లో దీని గురించి క్లారిటీ ఇస్తానని అన్నారు. కానీ విలేకరుల సమావేశంలో కన్నడ పవర్ టీవీ ఛానల్ వారు ఉంటే తాను మాట్లాడను అంటూ అక్కడి నుంచి వాకౌట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరోవైపు తాను నరేష్ తో రిలేషన్ షిప్ లో ఉన్నాను అని పవిత్ర లోకేష్ ఒప్పుకున్నట్లు గా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మరికొందరు నరేష్ మరియు పవిత్ర ఇప్పటికే రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారు అంటూ కొందరు కథనాలు సృష్టిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories