సినిమా ద్వారా తమ మధ్య బంధాన్ని చెప్పనున్న నరేష్ మరియు పవిత్ర లోకేష్

Naresh and Pavitra Lokesh: గత కొంతకాలంగా సీనియర్ నటులు నరేష్ మరియు పవిత్ర లోకేష్ గురించి జరుగుతున్న వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Arun Chilukuri
Published on: 19 Nov 2022 8:19 PM IST
Naresh and Pavitra Lokesh to act as hero-heroine soon
X

సినిమా ద్వారా తమ మధ్య బంధాన్ని చెప్పనున్న నరేష్ మరియు పవిత్ర లోకేష్

Naresh and Pavitra Lokesh: గత కొంతకాలంగా సీనియర్ నటులు నరేష్ మరియు పవిత్ర లోకేష్ గురించి జరుగుతున్న వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నరేష్ మరియు పవిత్ర లోకేష్ మధ్య అక్రమ సంబంధం ఉందని నరేష్ భార్య కేసు కూడా పెట్టిన సంగతి తెలిసిందే. ఇక వివాదాలను పక్కన పెడితే నరేష్ మరియు పవిత్ర లోకేష్ తమ మధ్య ఉన్న సంబంధం గురించి ఎప్పుడూ మీడియా ముఖంగా చెప్పలేదు. కానీ వారి మాటలు వింటుంటే మాత్రం వారి మధ్య ఏదో ఉందని తెలుస్తూనే ఉంటుంది. ఇద్దరూ కలిసి చాలానే సినిమాల్లో నటించారు.

ఈ మధ్యనే అలీ నటించిన అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే సినిమాలో కూడా ఇద్దరూ ముఖ్య పాత్రలలో కనిపించారు. తాజా సమాచారం ప్రకారం నరేష్ మరియు పవిత్ర ఇద్దరు కలిసి తమ జీవితాల ఆధారంగా ఒక సినిమాను తీయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది ఎవరి మీద బయోపిక్ కాకపోయినప్పటికీ వారి వ్యక్తిగత జీవితాల గురించి ఒక సినిమా తీయాలని నరేష్ కే ఐడియా వచ్చినట్లు సమాచారం. ఇక ఈ సినిమాతో నరేష్ పెళ్లిళ్ల గురించి మరియు ప్రస్తుతం ఉన్న రిలేషన్షిప్ గురించి కూడా క్లారిటీ వస్తుందని చెప్పుకోవచ్చు. నరేష్ మరియు పవిత్ర లోకేష్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు. కథలో కొంచెం ఫిక్షన్ కూడా జోడించబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరియు సినిమా నటీనటులు, టెక్నికల్ క్రూ గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story