Shyam Singha Roy: భారీ నష్టం..? కార‌ణం ఎంటంటే

Shyam Singha Roy Movie Set Damaged Havey Rains In Hyderabad
x

Shyam Singha Roy Movie

Highlights

Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని విభిన్న చిత్రాల‌ను ఎంచుకుంటూ త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని విభిన్న చిత్రాల‌ను ఎంచుకుంటూ త‌న కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు వైవిధ్యమైన కథలను ఎంచు కుంటూ కెరీర్ లో ముందుకు సాగుతున్నాడు. కొత్తద‌నం కోరుకునే తెలుగు ప్రేక్ష‌కుల త‌న‌దైన శైలిలో వినోదాన్నిపంచుతున్నారు. ఇక నిర్మాత‌గానూ నాని స‌క్సెస్ అయ్యాడు. ఇక నాని హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ''శ్యామ్ సింగ రాయ్''. నాని కెరీర్ భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమా తెర‌కెక్కుతుంది.

ఈ సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా చాలా రోజుల పాటు పశ్చిమ బెంగాల్ లో చిత్రీకరణ జరిపారు. తదుపరి షెడ్యూల్ ని హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ప్లాన్ చేసుకున్నారు. దీని కోసం 10 ఎకరాల విస్తీర్ణంలో 6.5 కోట్ల రూపాయ‌ల ఖర్చుతో భారీ సెట్ వేశారు. కలకత్తాలోని కాళీ మాత గుడితో సహా కొన్ని వీధులను గుర్తు చేసే విధంగా దీనిని నిర్మించారు. కరోనా టైంలో కూడా రిస్క్ చేసి చిత్ర యూనిట్ షూటింగ్ చేసారు. కేసులు ఎక్కువగా పెరుగుతుండటంతో ఇటీవలే నిలిపివేశారు.

కాగా.. అయితే హైదరాబాద్ లో గత మూడు రోజులుగా రాత్రి సమయంలో భారీ వర్షాలు పడటంతో ఆ భారీ సెట్ డ్యామేజ్ అయిందట. నిజానికి ఈ క్రమంలో ఇప్పుడు వర్షాల వల్ల మళ్ళీ ఖర్చు చేసి సెట్ కి మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందనని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ కలకత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందే పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఇందులో నాని డిక్టెటివ్ పాత్రలో నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

శ్యామ్ సింగ రాయ్ సినిమా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతుంది. కాగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి , కృతి శెట్టి. మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన నాని - సాయి పల్లవి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుదల చేశారు. దీంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొ్న్నాయి. ఇందులో జిషు సేన్ గుప్తా , రాహుల్ రవీంద్రన్ , మురళీ శర్మ, అభినవ్ గోమటం తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మిక్కీ జె.మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories