Shyam Singha Roy - Akhanda: అఖండ కోసం తప్పుకున్న "శ్యామ్ సింఘా రాయ్"

Nani Shyam Singha Roy Movie Release Postponed for Balakrishna Akhanda Movie
x

అఖండ కోసం తప్పుకున్న "శ్యామ్ సింఘా రాయ్"

Highlights

* బాలకృష్ణ కోసం వెనకడుగు వేసిన నాని

Shyam Singha Roy - Akhanda: న్యాచురల్ స్టార్ నాని ఈ మధ్యనే "టక్ జగదీశ్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రీతు వర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఒక ఫ్యామిలీ డ్రామాగా డైరెక్టుగా ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదలైంది. విడుదలకు ముందే మంచి అంచనాలను ఉన్నప్పటికీ ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఇక తాజాగా ఇప్పుడు నాని "శ్యామ్ సింఘా రాయ్" అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నాని కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాని డిసెంబర్ 24న సందర్భంగా విడుదల చేయాలని అనుకున్నారు.

కానీ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కూడా బోయపాటి దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న "అఖండ" సినిమాని క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని అనుకుంటున్నారట. తన సినిమా విడుదల కూడా డిసెంబర్ 24న చేయాలని అనుకుంటున్నట్లు తెలిసింది. దీంతో బాలకృష్ణ సినిమాతో క్లాష్ అవ్వడం ఇష్టం లేక నాని లైన్లో నుంచి తప్పుకునట్లు తెలుస్తోంది. అంటే అనుకున్న విధంగా శ్యాం"శ్యామ్ సింఘా రాయ్" క్రిస్మస్ కి విడుదల కావట్లేదు. ప్రస్తుతం ఈ సినిమాని వచ్చే ఏడాది విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని నిహారిక ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories