Shyam Singha Roy: మొట్ట మొదటి పాట అప్డేట్ ఇచ్చిన "శ్యామ్ సింఘ రాయ్"

Nani Shyam Singha Roy Movie First Single Will Release on 06 11 2021
x

మొట్ట మొదటి పాట అప్డేట్ ఇచ్చిన "శ్యామ్ సింఘ రాయ్"

Highlights

* "రైజ్ అఫ్ శ్యామ్" అనబోతున్న "శ్యామ్ సింఘ రాయ్" బృందం

Shyam Singha Roy: నాచురల్ స్టార్ నాని ఈ మధ్యనే "టక్ జగదీష్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రీతు వర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో విడుదలైంది. "నిన్ను కోరి" సినిమా తర్వాత నాని శివ నిర్వాణ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెండవ సినిమా ఇది. భారీ అంచనాల మధ్యన విడుదల అయినప్పటికీ ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. ప్రస్తుతం నాని తన తదుపరి సినిమా "శ్యామ్ సింఘ రాయ్" తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది.

"టాక్సీవాలా" ఫేమ్ రాహుల్ సంస్కృత్యాన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా నుంచి మొట్టమొదటి పాట లిరికల్ వీడియో వచ్చేనెల అనగా నవంబర్ 6 వ తారీకు న విడుదలకు సిద్ధమవుతోంది. మరి ఈ సినిమా పాటలు ఎలా ఉండబోతున్నాయో అంటూ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కనుంది. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories