Shyam Singha Roy: వింటేజ్ లుక్ లో నాని అదుర్స్

Nani Shyam Singha Roy Movie First Look Released
x

శ్యామ్  సింగ రాయ్ ఫస్ట్ లుక్ (ఫొటో ట్విటర్ట్)

Highlights

Shyam Singha Roy: నాని బర్త్ డే ముందు నుంచి ఫ్యాన్స్ కు వరుసగా సర్ ప్రైజ్ లు వస్తూనే ఉన్నాయి.

Shyam Singha Roy: నాని బర్త్ డే ముందు నుంచి ఫ్యాన్స్ కు వరుసగా సర్ ప్రైజ్ లు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే నాని నటించిన 'టక్ జగదీష్' టీజర్ వెరైటీగా విడుదల చేయడంతో బజ్ క్రియోట్ చేసింది. ఈరోజు నాని పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న మరో సినిమా 'శ్యామ్ సింగ రాయ్' ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే ఫ్యాన్స్ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో పెట్టుకున్నారు. విడుదలైన ఫస్ట్ లుక్ తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో అందరికి క్లారిటీ వచ్చేస్తుంది.

ఇక పోస్టర్ లో వింటేజ్ లుక్‌లో ఉన్న నాని.. ప్రీడం ఫైటర్ భగత్ సింగ్‌ను గుర్తు చేస్తున్నాడు. కోరమీసాలతో ఉన్న నానిని చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. నానిని వెనక నుంచి ఓ అమ్మాయి కౌగిలించుకుని ఉండటం.. ఆమె మొహం దాచేయడంతో ఆసక్తి మరింత పెరిగిపోతుంది. టక్ జగదీష్‌లో నీట్‌గా టక్ చేసి మాస్ లుక్‌లో కనిపించిన నాని.. ఇప్పుడు శ్యామ్ సింగ రాయ్ కోసం వింటేజ్ లుక్ లో కనిపించనున్నాడు. కోల్‌కత్తా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను రాహుల్ సంక్రీత్యన్ తెరకెక్కిస్తున్నాడు.

ఈ చిత్ర షూటింగ్ చాలా వరకు పూర్తైపోయింది. సత్యదేవ్ జంగా ఈ సినిమాకు కథను అందిస్తున్నాడు. విజయ్ దేవరకొండ టాక్సీవాలా తర్వాత రాహుల్ సంక్రీత్యన్ చేస్తున్న సినిమా ఇది. ఇందులో నానికి జోడీగా సాయి పల్లవి, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తున్నారు. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా 'శ్యామ్ సింగ రాయ్'. దాదాపు 40 కోట్లతో వెంకట్ బోయినపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు సమాచారం. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నాడు. నిహారిక మూవీస్ బ్యానర్‌పై శ్యామ్ సింగ రాయ్ వస్తుంది. 2021 డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.


Show Full Article
Print Article
Next Story
More Stories