Nani New Movie: ఫస్ట్ లుక్ తోనే షాక్ ఇస్తా అంటున్న నాని

Nani Says in Tuck Jagadish Movie Promotions All will get Shock by my new Movie First Look
x
నేచురల్ స్టార్ నాని (ఫోటో- ది హన్స్ ఇండియా)
Highlights

* నాని తన ఆశలన్నీ "శ్యామ్ సింఘా రాయ్" మరియు "అంటే సుందారానికి" పై పెట్టుకున్నాడు * ఫస్ట్ లుక్ తోనే అందరూ షాక్ అవుతారు

Nani New Movie: ఈ మధ్య ఓటిటి రిలీజ్ లు న్యాచురల్ స్టార్ నాని కి ఏమాత్రం కలిసి రావటం లేదు. గతేడాది ఓటిటిలో విడుదలైన "వీ" సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ డిజాస్టర్ గా మారింది. తాజాగా నాని హీరోగా నటించిన "టక్ జగదీష్" సినిమా థియేటర్లలోనే విడుదల కావాల్సింది. కానీ అప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఫైనల్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. శివ నిర్మాణ దర్శకత్వంలో "నిన్ను కోరి" సినిమా తర్వాత నాని హీరోగా నటించిన రెండవ సినిమా ఇది. కాబట్టి ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. రీతు వర్మ మరియు ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.

అయితే ఈ సినిమా కూడా నానికి ఏమాత్రం కలిసిరాలేదు. ఇక నాని తన ఆశలన్నీ "శ్యామ్ సింఘా రాయ్" మరియు "అంటే సుందారానికి" పై పెట్టుకున్నాడు. అయితే తాజా సమచారం ప్రకారం నాని తన నెక్స్ట్ సినిమాతో పెద్ద షాక్ ఇవ్వోతున్నాడట. ఈ విషయాన్ని నాని స్వయంగా చెప్పడం విశేషం. "టక్ జగదీష్" ప్రమోషన్స్ లో బాగంగా బిజీగా ఉన్న నాని దసరా సందర్భంగా తన నెక్స్ట్ సినిమా గురించి ప్రకటించనున్నాడట. ఇక ఆ సినిమా ఫస్ట్ లుక్ తోనే అందరూ షాక్ అవుతారు అని చెప్తున్నాడు నాని. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతోందో అని అందరూ ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories