Nani - Shyam Singha Roy: "శ్యామ్ సింగరాయి" రైట్స్ తో షాకిచ్చిన నాని

Record Deal for Shyam Singha Roy’s Satellite Rights
x

తెలుగు రైట్స్ తో కూడా రికార్డు సృష్టించిన నాని(ఫైల్-ఫోటో)

Highlights

Nani - Shyam Singha Roy: తెలుగు రైట్స్ తో కూడా రికార్డు సృష్టించిన నాని

Nani - Shyam Singha Roy: ఈ మధ్యనే "టక్ జగదీష్" సినిమాతో ఫ్లాప్ అందుకున్న నాచురల్ స్టార్ నాని ఈ సినిమాతో పెద్ద డిజాస్టర్ ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక తన ఆశలన్నీ తన తదుపరి సినిమా అయిన "శ్యామ్ సింగరాయి" పైనే పెట్టుకున్నాడు నాని. తన కరియర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కనున ఈ సినిమాలో "ఉప్పెన" బ్యూటీ కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ మరియు సాయి పల్లవి లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర తెలుగు శాటిలైట్ రైట్స్ ని జెమినీ టీవీ వారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్ర రైట్స్ కోసం జెమినీ టీవీ వారు నిర్మాతలకి ఏకంగా పది కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం.

ఇప్పటిదాకా నాని కెరీర్ లోనే శాటిలైట్ రైట్స్ ద్వారా ఇంత భారీ మొత్తాన్ని వసూలు చేసిన మొదటి సినిమా ఇదే. మరోవైపు ఈ చిత్ర హిందీ శాటిలైట్ రైట్స్ ని బి4యూ వారు కూడా 10 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు ఈ సినిమాకి సంబంధించిన రాయల్ ఈవెంట్ వరంగల్లోని రంగలీల మైదానంలో డిసెంబర్ 14న సాయంత్రం జరగబోతోంది. "టాక్సీవాలా" ఫేమ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 24న విడుదల కాబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories