అష్టా చమ్మా హీరోతో నాని సినిమా

Nani Next Movie With Ashta Chamma Hero
x

అష్టా చమ్మా హీరోతో నాని సినిమా

Highlights

* సహనటుడి దర్శకత్వంలో సినిమా సైన్ చేసిన నాని

Nani: న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల అనే ఒక కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో "దసరా" అనే సినిమాతో బిజీగా ఉన్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈనెల 30వ తేదీన థియేటర్లో విడుదల కాబోతోంది. ఈ సినిమా తర్వాత శౌర్యువ్ దర్శకత్వంలో #నాని30 సినిమా చేయబోతున్న నాని ఆ తర్వాత వివేకాత్రేయ దర్శకత్వంలో ఇంకో సినిమా చేయబోతున్నారు. అంతేకాకుండా శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ సిరీస్ కి సీక్వెల్ గా త్వరలో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న "హిట్ 3" సినిమాలో కూడా నటిస్తున్న నాని తాజాగా ఇప్పుడు మరొక డైరెక్టర్ తో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు.

తాజా సమాచారం ప్రకారం నటుడు మరియు డైరెక్టర్ అయిన శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాని ఒక సినిమా సైన్ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి నాని మరియు శ్రీనివాస్ అవసరాల ఇద్దరు "అష్టా చమ్మా" అనే సినిమాతో హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అప్పటి నుంచి వీరి మధ్య స్నేహం మొదలైంది. గతంలో శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించిన "జ్యో అచ్యుతానంద" సినిమాలో కూడా నాని ఒక కా?క్యామియో పాత్రలో కనిపించారు.

తాజాగా ఇప్పుడు శ్రీనివాస్ అవసరాల చెప్పిన కథ బాగా నచ్చడంతో నాని ఇప్పుడు ఈ సినిమాలో హీరోగా నటించడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం నాని చేతిలో బోలెడు సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నీ పూర్తిచేసుకుని శ్రీనివాస్ అవసరాలతో సినిమా తీయడానికి ఎక్కువ సమయమే పడుతుంది అని చెప్పవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories