Movie Release Dates: థియేటర్ లో నాగచైతన్య.. ఓటీటీలో నాని, నితిన్

admin1
Updated on: 26 Aug 2021 5:01 PM IST
Love Story Movie Releasing in Theaters And Tuck Jagadish, Maestro Releasing in OTT
X

Tollywood: కరోనా కారణంగా థియేటర్లు మరొకసారి మూతపడటంతో సినిమా విడుదలలు వాయిదా పడ్డాయి. అయితే తాజాగా థియేటర్లు రీఓపెన్ అవ్వడంతో సినిమాలు మళ్లీ విడుదల కు సిద్ధమయ్యాయి. నాని హీరోగా నటించిన "టక్ జగదీష్" మరియు నాగ చైతన్య హీరోగా నటించిన "లవ్ స్టోరీ" రెండు సినిమాలు ఒకే రోజున విడుదల కాబోతున్నాయి. అయితే ఒకటి థియేటర్లలో విడుదల కాబోతుండగా మరొకటి ఓటీటీ ప్లాట్ ఫాం లో విడుదలకు సిద్ధమైంది. నితిన్ హీరోగా నటించిన "మేస్ట్రో" సినిమా కూడా సెప్టెంబర్ 3న ఓటీటీ ప్లాట్ఫామ్ లో విడుదల కాబోతోంది.

కానీ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లవ్ స్టోరీ మాత్రం థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. సాయిపల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. తాజా సమాచారం ప్రకారం ఈ మూడు సినిమాలు ఇప్పుడు ఒక అగ్రిమెంట్ కి వచ్చాయి. నాగచైతన్య "లవ్ స్టోరీ" అనుకున్న తేదీన థియేటర్ లలో విడుదల కాబోతోంది. కానీ టక్ జగదీష్ మరియు మేస్ట్రో మాత్రం కొంచెం ఆలస్యంగా విడుదల కాబోతున్నాయి.

లవ్ స్టోరీ విడుదలైన రెండు రోజులకు అమెజాన్ ప్రైమ్ లో మేస్ట్రో సినిమా స్ట్రీమ్ కాబోతోంది. ఆ తరువాత వారానికి నాని టక్ జగదీష్ కూడా హాట్ స్టార్ లో విడుదల కాబోతోంది. ఈ మూడు సినిమాలకు సంబంధించిన నిర్మాతలు కలిసి ఈ నిర్ణయానికి వచ్చారు. ఎటువంటి గొడవలు జరగకుండా ఈ మూడు సినిమాల నిర్మాతలు సామరస్యంగా ఈ అగ్రిమెంట్ కి వచ్చారు.

admin1

admin1

Next Story