
Nani Movies: నాని జోరు మాములుగా లేదుగా.. మూడు కొత్త సినిమాలు ఫిక్స్!
Nani Movies: టాలీవుడ్ 'నేచురల్ స్టార్' నాని నటుడిగా మాత్రమే కాకుండా.. నిర్మాతగా కూడా తనదైన మార్క్‌ను కొనసాగిస్తున్నారు.
Nani Movies 2027: టాలీవుడ్ 'నేచురల్ స్టార్' నాని నటుడిగా మాత్రమే కాకుండా.. నిర్మాతగా కూడా తనదైన మార్క్‌ను కొనసాగిస్తున్నారు. 'వాల్ పోస్టర్' సినిమా బ్యానర్‌పై ఇప్పటికే కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన నాని.. 2027 సంవత్సరాన్ని లక్ష్యంగా చేసుకుని మూడు కొత్త సినిమాలను ప్రొడ్యూస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన వివరాలు ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.
నాని ప్రొడ్యూస్ చేయనున్న మొదటి ప్రాజెక్ట్‌గా ‘హిట్ 4’ మూవీ నిలుస్తోంది. హిట్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో కార్తి లీడ్ రోల్‌లో నటించనున్నారు. ఈ సినిమాకు హిట్ సిరీస్ సృష్టికర్త సైలేష్ కొలను దర్శకత్వం వహించనున్నారు. హిట్ ఫ్రాంచైజీకి కార్తి ఎంట్రీ కావడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ షూటింగ్ 2027 చివర్లో ప్రారంభం కానుందని సమాచారం.
రెండో ప్రాజెక్ట్‌గా ‘కోర్ట్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రామ్ జగదీశ్‌తో నాని మరోసారి కలిసి పనిచేయనున్నారు. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్‌లో నటించే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం దుల్కర్‌తో చర్చలు జరుగుతున్నాయట. ఈ కాంబినేషన్ కన్ఫర్మ్ అయితే.. పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమాకు మంచి బజ్ ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో టాప్ కాస్ట్ నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.
మూడవ ప్రాజెక్ట్‌గా నాని తన సోదరి దీప్తి ఘంటా దర్శకత్వంలో ఒక చిన్న బడ్జెట్ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్టోరీ డెవలప్ దశలో ఉంది. కొత్త తరహా కథనంతో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్.. వచ్చే ఏడాది ప్రారంభం కానుందని తెలుస్తోంది. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో నాని మరోసారి ముందడుగు వేస్తున్నారు. మొత్తానికి నటుడిగా బిజీగా ఉన్నప్పటికీ నిర్మాతగా కూడా బలమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు నాని చేస్తున్న ఈ ప్రయత్నాలు.. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌కు మరింత క్రేజ్ తీసుకురానున్నాయి. 2027లో ఈ మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




