హిట్ 3 ని ప్యాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్న నాని

Nani is Planning Hit 3 in Pan India Range
x

హిట్ 3 ని ప్యాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్న నాని

Highlights

Nani: హిట్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టనున్న నాని

Nani: ఈ మధ్యనే "అంటే సుందరానికి" సినిమాతో మంచి హిట్ అందుకున్న నాచురల్ స్టార్ నాని తాజాగా ఇప్పుడు తన తదుపరి సినిమా "దసరా" షూటింగ్ తో బిజీగా ఉన్నారు. శ్రీకాంత్ ఓదెల అనే ఒక కొత్త డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్లో నాని తన మాస్ లుక్ తో ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకట్టుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం నాని ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే నాని ఇప్పటికే "హిట్" అనే ఒక క్రైమ్ ధ్రిల్లర్ ఫ్రాంచైస్ ని తెలుగులో మొదలుపెట్టిన సంగతి తెలిసింది.

శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ ఫ్రాంచెస్ లోని మొదటి భాగంలో విశ్వక్ సేన్ హీరోగా నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. తాజాగా సినిమాలోని రెండవ భాగం కూడా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. అడవి శేష్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలవలేదు కానీ అప్పుడే "హిట్ 3" గురించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. నాని తాను నిర్మిస్తున్న "హిట్ 3" సినిమాని ఒకేసారి తెలుగు మరియు హిందీ భాషలలో నిర్మించాలని, ఒకేసారి తెలుగు మరియు హిందీలో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు మరియు అధికారిక ప్రకటన త్వరలో వెలువలడనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories