Top
logo

Balakrishna: అభిమానులకు విజ్ఞ‌ప్తి..దయచేసి ఎవ‌రూ రావ‌ద్దు

Bala Krishna urge to Fans
X

బాల‌కృష్ణ ఫైల్ ఫోటో 

Highlights

Balakrishna: ఈ నెల 10వ తేదీన‌ నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ పుట్టిన రోజు.

Balakrishna: ఈ నెల 10వ తేదీన‌ నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ పుట్టిన రోజు. ఆయ‌న పుట్టిన రోజు వ‌స్తుందంటే చాలు అభిమానులు పెద్ద ఎత్తున సంబాలు చేసుకుంటారు. వారం ముందు నుంచే అభిమానులు హ‌ల్ చ‌ల్ సృష్టి స్తారు. ప్ర‌తి ఏడాది అభిమానులు బాల‌కృష్ణ ఇంటికి త‌ర‌లి వచ్చేవారు ఈ నేప‌థ్యంలో బాలయ్య ఆయ‌న అభిమానుల‌కు విజ్ఞాప్తి చేశారు. క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తుండటంతో త‌న పుట్టిన రోజున‌ అభిమానుల్ని రావొద్ద‌ని కోరారు.

కొవిడ్ సెకండ్ వేవ్ తీవ్ర‌త దృష్ట్యా ఈసారి అలాంటి కార్య‌క్ర‌మాలు వ‌ద్ద‌ని, అంద‌రూ త‌మ త‌మ కుటుంబ స‌భ్యుల‌తోనే గ‌డ‌పాల‌న్నారాయ‌న‌. ''నా ప్రాణ సమానులైన అభిమానులకు విజ్ఞ‌ప్తి. జూన్ 10న నా పుట్టినరోజు సంద‌ర్భంగా ప్ర‌తి సంవ‌త్సరం నన్ను కలిసేందుకు నలుదిక్కుల నుంచి తరలివస్తున్న మీ అభిమానానికి సర్వదా విధేయుడ్ని. కానీ, కరోనా విలయతాండవం చేస్తోన్న‌ ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు రావటం అభిలషణీయం కాదు. నన్నింతటివాడ్ని చేసింది మీ అభిమానమే. ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను. మీ అభిమానాన్ని మించిన ఆశీస్సు లేదు.. మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదు. మీ కుటుంబంతో మీరు ఆనందంగా గడపటమే నా జన్మదిన వేడుక. దయచేసి ఎవ‌రూ రావ‌ద్ద‌ని తెలియ‌జేస్తున్నాను. ఈ విపత్కాలంలో అసువులు బాసిన నా అభిమానుల‌కు, కార్యకర్తలకు, అభాగ్యులందరికీ నివాళులర్పిస్తున్నాను'' అని పేర్కొన్నారు.

ప్ర‌స్తుతం బాల‌య్య హీరోగా బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో అఖండ అనే మూవీ రూపొందుతుంది. ఈ సినిమా టీజ‌ర్స్, టైటిల్ రోర్ కు అద్భ‌త‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది.

Web TitleNandamuri Balakrishna Urge to His Fans
Next Story