బాలయ్య షూటింగ్ సమయంలో కేవలం జ్యూస్ మాత్రమే తాగే వారట, ఎందుకో తెలుసా ?

Nandamuri Balakrishna Takes only Juice While Shooting Bhairava Dweepam Movie | Tollywood News Today
x

బాలయ్య షూటింగ్ సమయంలో కేవలం జ్యూస్ మాత్రమే తాగే వారట, ఎందుకో తెలుసా ?

Highlights

Nandamuri Balakrishna: సినిమానే దైవంగా భావించి పనిచేసే వాళ్ళలో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు.

Nandamuri Balakrishna: సినిమానే దైవంగా భావించి పనిచేసే వాళ్ళలో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. ఎంత స్టార్ హీరో అయినప్పటికీ బాలకృష్ణ ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందే ఉండేవారు. బాలకృష్ణ హీరోగా నటించిన అలాంటి ఒక ప్రయోగాత్మక సినిమానే "భైరవద్వీపం". సింగీతం శ్రీనివాసరావు సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక జానపద కథ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ హీరోగా వరుస సూపర్ హిట్ లు అందుకుంటున్న సమయంలో బాలకృష్ణ ఈ సినిమాలో ఒక కురూపి పాత్రలో కనిపించి అందరినీ షాక్ కి గురి చేశారు.

అయితే ఆశ్చర్యకరంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా మారింది. తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ తన పాత్ర కోసం మేకప్ వేయడానికి రెండు గంటల సమయం పట్టేదని అన్నారు బాలయ్య. మేకప్ తీయకుండా భోజనం చేయడం కుదరదు కాబట్టి షూటింగ్ సమయంలో బాలయ్య కేవలం జ్యూస్లు మాత్రమే తాగే వారట. సినిమా విడుదలైన తర్వాత అలాంటి ఒక పాత్రలో బాలకృష్ణ ని చూసి అభిమానులు అవాక్కయ్యారు. కానీ బాలకృష్ణ కి కథ పై ఉన్న నమ్మకం అలాంటిది. ఆ నమ్మకమే నిజమై సినిమా సూపర్హిట్ అయింది. షూటింగ్ సమయంలో ఒక సీన్లో బాలకృష్ణ కి రాళ్లు, ముళ్ళు కూడా దిగి పోయినప్పటికీ అవేమీ పట్టించుకోకుండా తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు బాలయ్య.

Show Full Article
Print Article
Next Story
More Stories