logo
సినిమా

చిరంజీవి కంటే బాలయ్య లైనప్ బెటర్.. కంగారు పడుతున్న మెగా అభిమానులు...

Nandamuri Balakrishna Line Up is Better than Megastar Chiranjeevi | Live News
X

చిరంజీవి కంటే బాలయ్య లైనప్ బెటర్.. కంగారు పడుతున్న మెగా అభిమానులు...

Highlights

Chiranjeevi - Balakrishna: ప్రస్తుతం యువ హీరోల కంటే సీనియర్ హీరోలకే మంచి లైనప్ ఉన్నట్లు తెలుస్తోంది...

Chiranjeevi - Balakrishna: ప్రస్తుతం యువ హీరోల కంటే సీనియర్ హీరోలకే మంచి లైనప్ ఉన్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ వంటి సీనియర్ హీరో లకి చేతిలో బోలెడు సినిమాలు ఉన్నాయి. తమ అభిమాన హీరోలు తదుపరి సినిమాలు గురించి తెలిస్తే అభిమానులు కూడా సంతోష పడతారు. అయితే చిరంజీవి మరియు బాలకృష్ణ ల మధ్య చూస్తే చిరంజీవి కంటే బాలకృష్ణ లైనప్ బాగుందని అభిమానులు చెబుతున్నారు.

ఆచార్య సినిమాతో ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి మర్చిపోలేని డిజాస్టర్ ను అందుకున్నారు. దీంతో చిరంజీవి తదుపరి సినిమాలపై బజ్ కొంచెం తగ్గిందనే చెప్పుకోవచ్చు. చిరంజీవి మోహన్ రాజా డైరెక్షన్ లో "గాడ్ఫాదర్", మెహర్ రమేష్ దర్శకత్వంలో "భోళా శంకర్" సినిమాలు చేయనున్నారు. అసలు డిజాస్టర్ సినిమాలకు అందించిన మెహర్ రమేష్ తో సినిమాను చిరంజీవి ఎలా ఓకే చేశారు అని అభిమానులు ఇప్పటికీ కంగారు పడుతున్నారు. మరోవైపు బాబీ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నారు చిరు.

ఇక వెంకీ కుడుముల వంటి డైరెక్టర్ చిరంజీవి లాంటి పెద్ద స్టార్ ని హ్యాండిల్ చేయగలరా అని అనుమానాలు కూడా కొందరిలో ఉన్నాయి. ఇలా మెగాస్టార్ ఎంచుకున్న దర్శకులలో ఎవరు సక్సెస్ లో లేరు. మరోవైపు బాలకృష్ణ మాత్రం "క్రాక్" తో సూపర్ హిట్ అందుకున్న గోపీ చంద్ మలినేని, సూపర్ హిట్ సినిమాలతో దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో సినిమాలు చేస్తున్నారు.

Web TitleNandamuri Balakrishna Line Up is Better than Megastar Chiranjeevi | Live News
Next Story