బిగ్ బాస్ 3 కోసం కింగ్ రాబోతున్నాడా

హిందీలో పాప్యులర్ అయిన రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ తెలుగు లో రెండు సీజన్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే....
హిందీలో పాప్యులర్ అయిన రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ తెలుగు లో రెండు సీజన్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన మొదటి సీజన్ సూపర్ హిట్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ రెండో సీజన్ బోలెడు వివాదాలను తెరపైకి తీసుకువచ్చింది. ఇక ఇదంతా పక్కనపెడితే ప్రస్తుతం బిగ్ బాస్ మూడవ సీజన్ పైనే అందరి దృష్టి పడింది. ఈ సీజన్ కి ఎవరు హోస్ట్ గా వ్యవహరించనున్నారు అనేది ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది. ఇప్పటికే నాని మళ్లీ హోస్ట్ గా మారే అవకాశాలు అసలు లేవని ఖరాఖండిగా చెప్పేసాడు.
ఈ నేపథ్యంలో బిగ్ బాస్ నిర్మాతలు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ వద్దకు వెళ్లారు. కానీ 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉండటంవల్ల ఎన్టీఆర్ వారికి డేట్లను కేటాయించలేక పోయాడు. కొంతకాలం పాటు వెంకటేష్ పేరు కూడా వినిపించింది. ఇక తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ కింగ్ నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా మారనున్నారు అని టాక్ నడుస్తోంది. ఇప్పటికే మా టీవీ లో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో హిట్ అవడానికి గల ముఖ్య కారణం నాగార్జున అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే నాగార్జునను సంప్రదించగా మరి కొద్ది రోజుల్లో తన అభిప్రాయాన్ని చెప్పనున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే బిగ్ బాస్ 3 జూన్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
జమ్మూకశ్మీర్‌లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్
20 May 2022 4:00 AM GMTCyber Crime: అంతకంతకూ పెరుగుతున్న సైబర్ నేరాలు
20 May 2022 3:45 AM GMTఇబ్బందుల్లో పడ్డ అఖిల్ ఏజెంట్ సినిమా
20 May 2022 3:21 AM GMTHyderabad: జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులను వేధిస్తున్న జీతం కట్ సమస్య
20 May 2022 2:47 AM GMTవిశాఖ స్టీల్ ప్లాంట్ భూముల లెక్కలపై అయోమయం
20 May 2022 2:27 AM GMT