అజిత్ కోసం పోలీస్ గా మారనున్న నాగార్జున

అజిత్ కోసం పోలీస్ గా మారనున్న నాగార్జున
Nagarjuna: తమిళ్ స్టార్ హీరో అజిత్ హీరోగా నటిస్తున్న "వాలిమై" సినిమా తెలుగులో కూడా అదే టైటిల్ తో విడుదల కాబోతోంది.
Nagarjuna: తమిళ్ స్టార్ హీరో అజిత్ హీరోగా నటిస్తున్న "వాలిమై" సినిమా తెలుగులో కూడా అదే టైటిల్ తో విడుదల కాబోతోంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఫిబ్రవరి 24న థియేటర్లో విడుదల కాబోతోంది. సినిమా పూర్తయిన తర్వాత అజిత్ వినోద్ మరియు బోనికపూర్ లతో ఒక సినిమా చేయబోతున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఒక దొంగతనం చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఈ చిత్ర షూటింగ్ మార్చి 9 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో ఒక సీనియర్ హీరో పోలీస్ కమిషనర్ పాత్రలో కనిపించాలని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ పాత్ర కోసం మలయాళం మరియు తెలుగులో నటులను వెతికిన దర్శకనిర్మాతలు చివరికి నాగార్జున ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
సినిమాలో పోలీస్ కమిషనర్ పాత్రకి చాలా ప్రాధాన్యత ఉండబోతోందని ఆ పాత్రలో నాగార్జున అయితే చాలా బాగుంటుంది అని దర్శక నిర్మాతలు విశ్వసిస్తున్నారు. పోలీస్ యూనిఫాం లో నాగార్జున ని చూసి ఇప్పటికే చాలా కాలం అయింది. దీంతో అభిమానులు కూడా ఈ సినిమాపై సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే నాగార్జున మరియు మోహన్ లాల్ ఇద్దరిలో ఎవరో ఒకరు ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం అదితి రావు హైదరి ని సంప్రదించనున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది.
పెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTతండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMT
ICICI Bank: విద్యార్థుల కోసం ప్రత్యేక డిజిటల్ ప్లాట్‌ఫాం.. ఇక అన్ని...
26 Jun 2022 4:30 AM GMTనాగచైతన్య జెంటిల్ మ్యాన్ అంటున్న రాశి ఖన్నా
26 Jun 2022 4:23 AM GMTబీహార్‌కు చెందిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇంట్లో డబ్బే డబ్బు
26 Jun 2022 3:30 AM GMTగుజరాత్ రాష్ట్రం రాజ్‌కోట్ జిల్లా గొండాల్‌లో భారీ వర్షం
26 Jun 2022 3:00 AM GMTKollapur: కొల్లాపూర్‌లో హై టెన్షన్
26 Jun 2022 2:34 AM GMT